Home అంతర్జాతీయ వార్తలు హోటల్ లో భారీ అగ్నిప్రమాదం: 8 మంది సజీవదహనం

హోటల్ లో భారీ అగ్నిప్రమాదం: 8 మంది సజీవదహనం

Ukraine

ఒడెసా: యుక్రెయిన్ దేశం ఒడెసా నగరంలోని ఓ హోటల్ లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనంకాగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని 150 మందిని హోటల్ నుంచి బయటకు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు వొలోదమైర్ జిలెన్‌స్కియ్ తెలిపారు. అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బంది అగ్రిమాపక శాఖకు ఫోన్ చేశారని వివరించారు. ప్రస్తుతం మంటలు 1000 చదరపు మీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అంత పెద్ద హోటల్‌లో భద్రతా పరమైన చర్యలు లేకపోవడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని, దీంతో హోటల్ యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధ్యక్షుడు పోలీసులకు సూచించారు.

 

Eight Died in Fire Accident at Hotel in Ukraine