Home తాజా వార్తలు మహిళపై ఎనిమిది మంది అత్యాచారం… ఆమె పరిస్థితి విషమం

మహిళపై ఎనిమిది మంది అత్యాచారం… ఆమె పరిస్థితి విషమం

Rape

 

ఛండీగఢ్: హర్యానాలో ఓ మహిళపై ఎనిమిది అత్యాచారం చేయడంతో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యుపికి చెందని ఓ మహిళ(55) కర్నాల్ రైల్వే స్టేషన్‌లో రైలుకోసం ఎదురుచూస్తుంది. ఇంతలోనే ఓ వ్యక్తి వచ్చి తన దగ్గర అన్నం ఉందని ఇస్తానని నమ్మపలికాడు. దీంతో మహిళ నమ్మి అతడితో రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న షెడ్‌కు వెళ్లింది. కానీ అప్పటికే అక్కడు ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. ఆమెపై ఐరన్ రాడ్‌తో దాడి చేసిన అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అక్కడి నుంచి నిందితులు వెళ్లిపోయిన అనంతరం ఆమె పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి సిసి కెమెరాల రికార్డు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

 

Eight Members Gang Raped on Women in Haryana