Saturday, April 20, 2024

పార్లమెంటు సమావేశాలకు దూరంగా 8 మంది ఎంపిలు

- Advertisement -
- Advertisement -

Eight members stay away from Lok Sabha

న్యూఢిల్లీ : వివాహం నుంచి జైలులో నిర్బంధం వరకు వివిధ కారణాలపై 8 మంది ఎంపిలు పార్లమెంట్ శీతాకాల సమాశేశాలకు దూరంగా ఉండవలసి వచ్చింది. ప్రస్తుత ఎంపీల్లో ఎవరు హాజరు కాలేదో కాంగ్రెస్ ఎంపి రవినీత్ సింగ్ బిట్టు అధ్యక్షుడుగా ఉన్న కమిటీ నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. వీరంతా పార్లమెంట్ నుంచి అనుమతి పొందారు కూడా. వివాహం కారణంగా సిక్కిం క్రాంతికారి మోర్చా సభ్యుడు ఇంద్ర హంగ్ సుబ్బా మొత్తం శీతాకాల సమావేశాలకు హాజరు కాలేనని అనుమతి పొందారు. జైలులో నిర్బంధం కారణంగా తాము సమావేశాలకు హాజరు కాలేకపోతున్నామని శెలవు కావాలని సమాజ్‌వాది పార్టీ ఎంపి ఆజం ఖాన్ (రాంపూర్) బహుజన్‌సమాజ్ పార్టీ ఎంపి అతుల్‌కుమార్ సింగ్ అనుమతి కోరారు. అస్వస్థత కారణంగా తాము హాజరు కాలేకపోతున్నామని మాజీ కేంద్ర మంత్రులు రమేష్ పొఖ్రియాల్, నిషాంక్, సంజయ్ ధోత్రే, తృణమూల్ ఎంపి శిశిర్ కుమార్ అధికారి, బిజెపి ఎంపి వి.శ్రీనివాస్ ప్రసాద్ శెలవు కోరారు. చత్తీస్‌గఢ్ లోని దుర్గ్ నియోజక వర్గ బిజెపి ఎంపి విజయ్ బఘేల్ తన నియోజక వర్గంలో ఎన్నికల కారణంగా తాను హాజరు కాలేకపోతున్నానని శెలవు కోరారు. సింగ్, పొఖ్రియాల్, ధోత్రే, అధికారి తదితర ఎంపిలకు 26 రోజుల పాటు శెలవు ఆగస్టు 8 న మంజూరయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News