Thursday, April 25, 2024

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: హైదరాబాద్ ఎనిమిది సీట్లలో పోటాపోటీ తప్పదు !

- Advertisement -
- Advertisement -
జిహెచ్‌ఎంసి గెలుపు జోరును కొనసాగించాలనుకుంటున్న బిజెపి

హైదరాబాద్: ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే హైదరాబాద్‌లోని ఎనిమిది సీట్లలో రాజకీయంగా పోటాపోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో మొత్తం 15 అసెంబ్లీ సీట్లున్నాయి. వాటిలో ఏడు సీట్లు మజ్లీస్ పార్టీకి అనుకూలంగా ఉండనున్నాయి. కాగా మిగతా ఎనిమిది సీట్లలో మాత్రం రాజకీయంగా పోటీపోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. పోటీ ప్రధానంగా భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్), భారతీయ జనతా పార్టీ(బిజెపి) నడుమే ఉండనున్నది. అయితే ఈ రెండు పార్టీల చీలిక ఓట్లు కాంగ్రెస్‌కు లాభం చేకూర్చనున్నాయి. 2018లో హైదరాబాద్‌లో బిజెపి కేవలం ఒకే ఒక్క సీటు గెలిచింది.

హైదరాబాద్ అసెంబ్లీ సీట్ల జాబితా:
ముషీరాబాద్(బిఆర్‌ఎస్), మలక్‌పేట్(మజ్లీస్), అంబర్‌పేట్(బిఆర్‌ఎస్), ఖైరతాబాద్(బిఆర్‌ఎస్), జూబ్లీహిల్స్(బిఆర్‌ఎస్), సనత్‌నగర్(బిఆర్‌ఎస్), నాంపల్లి(మజ్లీస్), కార్వాన్(మజ్లీస్), గోషామహల్(బిజెపి), చార్మినార్(మజ్లీస్),చాంద్రాయణగుట్ట(మజ్లీస్), యాకుత్‌పురా(మజ్లీస్), బహదూర్‌పురా(మజ్లీస్), సికింద్రాబాద్(బిఆర్‌ఎస్), సికింద్రాబాద్ కంటోన్మెంట్(బిఆర్‌ఎస్).
ఇదిలావుండగా 2020లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో బిజెపి 48 సీట్లను గెలుచుకుంది. దాన్నే ఊతంగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయావకాశాలను దండుకోవాలని చూస్తోంది. బిజెపి ఇప్పుడు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, అంబర్‌పేట్, ముషీరాబాద్, గోషామహల్, కార్వాన్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్‌లో తన దృష్టిని సారించింది. ఆ పార్టీ నాయకులు ఆ నియోజకవర్గాల్లో తెగ తిరిగేసి ప్రజలకు దగ్గరవుతున్నారని సమాచారం. కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. రాజాసింగ్ వర్గం గోషామహల్ నియోజకవర్గంపై పట్టు సాధించాలనుకుంటోంది. మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో ఇతర బిజెపి నాయకులు దృష్టి పెట్టారు. 2020లో జిహెచ్‌ఎంసి సీట్లలో బిఆర్‌ఎస్ సీట్లు 99 నుంచి 56కు తగ్గిపోయింది. అయినప్పటికీ ఈసారి బిఆర్‌ఎస్ తిరిగి తన సత్తాను చాటుకుంటుందని భావించాలి. హైదారబాద్‌లోని అసెంబ్లీ సీట్లలో ఎనిమిదికిపైగా తిరిగి గెలుచుకుంటేనే బిజెపిని ఎదుర్కొన్నట్లు కాగలదు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News