Home తాజా వార్తలు ప్రియుడి కోసం సొంత తమ్మున్ని చంపించిన అక్క

ప్రియుడి కోసం సొంత తమ్మున్ని చంపించిన అక్క

Elder sister killed the brother for an illegal affair

 

గూడూరు: అక్రమ సంబంధాన్ని బయట పెడతాడేమోనని తమ్మున్ని చంపించిన ఘటన భూపతిపేట గ్రామంలో చోటు చేసుకుంది. భూపతిపేట హత్య కేసులో కీలక విషయాలను గూడూరు సిఐ రాజిరెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన కుందారపు విక్రమ్ తన అక్క అయిన కలవచర్ల రోజా కూలిపనికి భూపతిపేట గ్రామం నుండి టాటాఎసిలో వెళ్లేది. ఇలా తరుచూ వెళ్తూ టాటా ఎసి డ్రైవర్ అదే గ్రామానికి చెందిన పులిచెర్ల సంతోష్‌కుమార్‌తో చనువు పెరిగి అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం కాస్త రోజా తమ్ముడైన విక్రమ్‌కు తెలియడంతో పలుమార్లు బహిరంగంగానే వారిని మందలించడం జరిగింది.

అయినా వారి అక్రమసంబంధాన్ని అలాగే కొనసాగించడమే కాకుండా రోజా స్నేహితురాలు బొడ్డు రేణుక సహాయంతో వారి గృహంలో శారీరకంగా కలిసేవారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రోజా సోదరుడు ఆగృహానికి వచ్చి తన అక్కను విడిచిపెట్టాలని, పిల్లలు ఉన్నారని మందలించడంతో ఎన్నిరోజులు ఉన్నా మీ తమ్ముడు మన పరువు తీస్తాడని రోజాకు సంతోష్‌కుమార్ చెప్పి మీ తమ్ముని పీడ విరగడ కావాలంటే చంపేయాలని చెప్పడంతో రోజా సరే అన్నది. దీంతో ప్రణాళిక వేసుకున్నారు. ఈ విషయంలో రోజా స్నేహితురాలు సైతం విక్రమ్ హత్యకు సహకరించినట్లు తెలిసింది. హత్య జరిగిన రోజు రాత్రి 10 గంటలకు మృతుడు విక్రమ్ గూడూరు నుండి భూపతిపేటకు వెళ్తుండగా పులిచేరి సంతోష్‌కుమార్ వెళ్లి పథకం ప్రకారం కుట్రపన్ని చీకటిలో విక్రమ్‌పై వెనుకనుండి రాడ్‌తో దాడి చేయడంతో కిందపడిపోయి తీవ్ర రక్తస్రావం కాగా ఇంకా చనిపోలేదని సంతోష్‌కుమార్ చూసి బండరాయిని తలపైమోది చంపేశాడు.

ఇదంతా సంతోష్, రోజా, రేణుకల పథకం ప్రకారం కుట్రపన్ని విక్రమ్‌ను చంపేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకొని వారి వద్ద ఒక రాడ్, మూడు సెల్‌ఫోన్లు, టాటా ఎసి వాహనం, ఒక ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై 120బి, 302, 34 ఐపిసి సెక్షన్‌ల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండుకు పంపడం జరిగిందని, హత్యకేసులో ప్రతిభ చూపించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ బిక్షనాయక్, సంపత్, శ్రీను, నాగరాజులను ఎస్పి అభినందించారు.

Elder sister killed the younger brother for an illegal affair