Home తాజా వార్తలు వృద్ధ దంపతుల బలవన్మరణం!

వృద్ధ దంపతుల బలవన్మరణం!

Elderly couple committed Suicide in Kurnool

అమరావతి: విషం తాగి వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఎపిలోని కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే వృద్ధ దంపతులు కొన్ని నెలల ముందు ఓ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. ఈ క్రమంలో తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ ఇటీవల బ్యాంకు సిబ్బంది నోటీసులు పంపించారు. అయితే, రుణాలను చెల్లించే స్థోమత లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆ దంపతులు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారమ అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.