Home జాతీయ వార్తలు బెంగళూరులో వృద్ధ దంపతుల హత్య

బెంగళూరులో వృద్ధ దంపతుల హత్య

Murderబెంగళూరు : బెంగళూరులో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. గరుడాచార్య పాళ్య ఆర్‌హెచ్‌బీ కాలనీ ఈ ఘటన జరిగింది. చంద్రేగౌడ(63), లక్ష్మమ్మ (55) దంపతులు ఈ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేకపోవడంతో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఇటీవలే ఆ అమ్మాయికి పెళ్లి జరిగింది. దీంతో వీరిద్దరే ఇంట్లో ఉంటున్నారు. గురువారం రాత్రి ఇంట్లో చొరబడిన దొంగలు వీరిని హత్య చేసి నగదు, నగలు చోరీ చేశారు. పోస్టుమార్టం కోసం చంద్రేగౌడ, లక్ష్మమ్మల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Elderly Couple Murder In Bangalore