Home జాతీయ వార్తలు వృద్ధ దంపతుల దారుణ హత్య

వృద్ధ దంపతుల దారుణ హత్య

MURDERమెదక్ : నారాయణఖేడ్ మండలం సత్యగామ గ్రామంలో దుండగులు శుక్రవారం అర్ధరాత్రి వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అంబయ్య(75), సుశీలమ్మ(70) దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కొడుకు సత్తయ్య గ్రామంలోనే కొత్త ఇంటిని నిర్మించుకుని అందులో ఉంటున్నాడు. అంబయ్య దంపతులు పాత ఇంట్లోనే ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దుండగులు ఇంట్లోకి చొరబడి దంపతులను దారుణంగా హత్య చేసి, ఇంట్లో ఉన్న నగలు, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు.