Thursday, March 28, 2024

ముగ్గురు బాలికలపై వృద్ధుడి లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

Elderly man sexual assulting on three girls

 

మనతెలంగాణ/హైదరాబాద్ : మనవరాలి వయసున్న ముగ్గురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జలాల్ పూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన పీరా అహ్మద్ అనే 55 సంవత్సరాల వృద్ధుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికకు డబ్బులు ఇచ్చి చాక్లెట్లు ఆశ చూపుతూ లైంగిన దాడికి పాల్పడుతున్నట్లు బాధిత కుటింబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చాక్లెట్లు, డబ్బులు ఇస్తానని నమ్మబలికి గ్రామంలో నిర్మాణం పూర్తయిన నూతన గృహంలో బాలికని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈక్రమంలో వరి నాట్లు సీజన్ ప్రారంభం కావడంతో గ్రామంలో మధ్యాహ్నం వేళ కుటుంబ పెద్దలు ఇళ్లలో లేని సమయం ఎంచుకుని సదరు వృద్ధుడు అఘాయ్యిత్యాలకు పాల్పడుతున్నట్లు కాలనీ వాసులు పేర్కొంటున్నారు.

కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు పొలం పనులకు వెళుతున్నక్రమంలో ఇదే అదునుగా భావించిన కామాంధుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు కాలనీ వాసులు వివరిస్తున్నారు. కాగా బాధిత బాలిక మూడు రోజుల నుండి జ్వరంతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు గమనించి ఆరా తీశారు. దీంతో ఆ బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులు వివరించింది. తన మీదనే కాక మరో ఇద్దరు స్నేహితుల పై లైంగిక దాడికి పాల్పడ్డాడని రోదిస్తూ తెలిపింది. దీంతో ముగ్గురు బాలికల కుటుంబీకులు, కాలనీ వాసులు కలిసి పీరా అహ్మద్‌కు దేహ శుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేసి వృద్ధుడిని అప్పగించారు. ముగ్గురు బాలికలపై వృద్ధుడు లైంగిక దాడులకు పాల్పడిన ఘటనపై నవీన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News