Home తాజా వార్తలు బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

deod

అశ్వారావుపేట :ఆర్‌టిసి బస్సు ఢీ కొని వృద్ధురాలు మరణించిన సంఘటన బుధవారం మండల కేంద్రం అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. అశ్వారావుపేటలోని తూర్పు బజారుకు చెందిన గోధుమ మంగమ్మ(60) రోజు వారి కూలి పనులలో భాగంగా బుధవారం ఉదయం ఇంటివద్ద నుండి బయలు దేరి ఆర్‌టిసి బస్టాండ్ సమీపంలోని ఓ గృహం వద్దకు వెళ్తుండగా భద్రాచలం డిపోకు చెందిన బస్సు భద్రాచలం నుండి రాజమండ్రి వెళ్తుండగా బస్టాండ్ వద్ద అదుపుతప్పి ఆమెను ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మంగమ్మ కుమారుడు గోదుమ శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు ఆర్‌టిసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ శంకర్ తెలిపారు.