Home తాజా వార్తలు గోవా, పంజాబ్‌ల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

గోవా, పంజాబ్‌ల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

Goa-Punjab-Electionsన్యూఢిల్లీ : ఫిబ్రవరి 4న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్, గోవాల్లో గురువారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలు, గోవాలోని 40 స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగనున్నాయి. బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలో ఎన్నికల్లో గెలిచేందుకు హోరాహోరీగా ప్రచారం చేశాయి. కాగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో పోలింగ్ జరుగనుంది.