న్యూఢిల్లీ : గోవాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ‘డబ్బులు తీసుకోండి.. కానీ ఓటు బిజెపికే వేయండి’ అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు ఎన్నికల సంఘం మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 9లోపు ఫైల్ రూపంలో వివరణ ఇవ్వాల్సింది ఇసి నోటీసులో పేర్కొంది. గత వారంలో కూడా పారికర్‌ను ఇసి పంపిన నోటీసులపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసులు వ్యక్తిగతంగా పంపించకుండా ముందుగా వెబ్సైట్లో ఉంచడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి ఇసి నేరుగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది.