Thursday, March 28, 2024

స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

Elections to GHMC Standing Committee on June 29

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి కొత్త స్టాడింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుత స్టాండింగ్ కమిటీ కాల పరిమితి పూర్తి కావడంతో కొత్త కమిటి ఎన్నికకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్ తెలిపారు. ఈ నెల 10వతేదీ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్ జరగనుందని తెలిపారు. 15 మందితో కూడిన స్టాడింగ్ కమిటి ఎన్నికకు గాను ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని పని దినాల్లో జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని 3వ అంతస్తులోని ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ నామినేషన్లను స్వీకరిస్తారని కమిషనర్ వెల్లడించారు.

స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్డ్..

ఈ నెల 5వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
10 వ తేదీ నుంచి 18 తేదీ వరకు పనిదినాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకు నామినేషన్ల స్వీకరణ.
19 వ తేదీ దాఖలైన నామినేషన్ల సంఖ్య ప్రకటన
20 వ తేదీ ఉదయం 11 గంటలకు స్క్రూట్నీ.
23 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. తూది జాబితా ప్రకటన.
29 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు, అనంతరం కౌంటింగ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News