Home తాజా వార్తలు ఇక మున్నిపల్ ఎన్నికలు

ఇక మున్నిపల్ ఎన్నికలు

Municipalities

 

హైకోర్టు గ్రీన్‌సిగ్నల్, కేసులు కొట్టేసిన ధర్మాసనం

త్వరలో నోటిఫికేషన్
ఎన్నికల కమిషన్ సిద్ధం
10 నగర పాలికలకు వివాదాల్లేని, మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలు
77 మున్సిపాలిటీల్లో ఎన్నికలపై తొలగవలసిన స్టే

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరట కల్పిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికలకు అవసరమైన ముంద స్తు ప్రక్రియ తప్పుల తడకగా చేశారని పేర్కొంటూ దాఖలైన రెండు వేరు వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను (పిల్స్) హైకోర్టు కొట్టివేసింది. పిల్స్‌లో జోక్యం చేసుకునేందుకు ఏమీ లేదని తేల్చి చెబు తూ తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని 24 3 (జెడ్)నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకునే ందుకు వీల్లేదని, ఈ మేరకు సుప్రీంకోర్టు మార్గదర్శ కాలు కూడా ఉన్నాయని, దీంతో పిల్స్‌లో జో క్యం చేసుకోవడం లేదని తీర్పులో పేర్కొంది. ఇప్పటికే ఎన్నికల ముందస్తు ప్రక్రియ మొదలైందని, ఈ దశలో జోక్యం చేసుకోలేమని తీర్పు చెప్పి ంది.

ఈ మేరకు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ కీలక తీర్పు చెప్పింది. మున్సిపల్ యాక్ట్‌లోని సెక్షన్ 11 ప్రకారం శాసనసభ ఎన్నికల ఓటర్ల లిస్ట్ మేరకు మున్సిపల్ ఎన్నికలను నిర్వహించవచ్చునని స్పష్టం చేసింది. ఆ లిస్ట్ రెడీగా ఉన్నప్పుడు ఇప్పుడున్న సాంకేతికత మేరకు సత్వరమే రిజర్వేషన్ కేటగిరీల వర్గీకరణ చేయడం కష్టమేమీ కాదని స్పష్టం చేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళ రిజర్వేషన్ల వర్గీకరణలో తప్పులు జరిగినట్లుగా ఎక్కడా ఓటర్లు చెప్పలేదంది. 2019 జులై 3న ఇచ్చిన నోటిఫికేషన్ అమలు చేయలేదని, దానిని సవాల్ చేయడం చెల్లదని తీర్పులో తేల్చింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా ఓటర్ల లిస్ట్ తయారు చేసుకోవచ్చునని, ఎలక్షన్ క్యాలెండర్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించలేదు కాబట్టి ఆ నోటిఫికేషన్‌ను సవాల్ చేయడం చెల్లదని తీర్పు చెప్పింది.

తీర్పు వెలువడిన వెంటనే ప్రభుత్వం తరఫున అడిషినల్ అడ్వకేట్ జనరల్ జె.రామచందర్‌రావు కల్పించుకుని.. సింగిల్ జడ్జి వద్ద కూడా మున్సిపల్ ఎన్నికలపై కేసులు ఉన్నాయని, పలు కేసుల్లో స్టేలు కూడా వెలువడ్డాయని, వాటి విషయంలో డివిజన్ బెంచ్ జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన డివిజన్.. వాటి విషయంలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. అయితే సింగిల్ జడ్జి దగ్గరే ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. తమ ముందున్న పిల్స్ విషయంలో తాము తీర్పు చెప్పామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన గడువు పూర్తి కాలేదు. మిగిలిన పది కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సివుంటుంది. 128 మున్సిపాలిటీల్లో 77 మున్సిపాలిటీల ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఆదేశాలిచ్చారు. వీటి విషయంలోనూ న్యాయపరమైన అవరోధాలు తొలగింపునకు ఆదేశాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయాన్ని సింగిల్ జడ్జి దగ్గరే పరిష్కరించుకోవాలని డివిజన్ బెంచ్ తెలిపింది.

నిర్మల్ జిల్లాకు చెందిన కె.అన్జుకుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి వేరువేరుగా దాఖలు చేసిన పిల్స్‌లో మున్సిపల్ వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల ఖరారు చట్ట నిబంధనల ప్రకారం చేయలేదన్నారు. రాజ్యాంగంలోని 243 జెడ్(జి) ఆర్టికల్ ప్రకారం ఎన్నికల వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోడానికి వీల్లేదని, రాజ్యాంగంలోని 329 ప్రకారం అయిదేండ్ల గడవు ముగిసిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. పిల్స్‌పై సుదీర్ఘంగా విచారించిన డివిజన్ బెంచ్ ఈ నెల 1న వాదనలు పూర్తి కావడంతో తీర్పును వాయిదా వేసినప్పుడే ఎన్నికల ముందస్తు ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేయరాదని అప్పుడు ఆదేశించగా ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోయేలా ఆ పిల్స్‌ను డిస్మిస్ చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది.

Elections to Municipalities