Home తాజా వార్తలు సంచార జాతులకు ఎలక్ట్రిక్ ఆటోలు

సంచార జాతులకు ఎలక్ట్రిక్ ఆటోలు

electric-autos

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలొ తోలి సారి సంచార జాతులకు ఎలక్ట్రిక్ ఆటోల పంపిణికి రాష్ట్ర బిసి ఫైనాన్స్ కార్పోరేషన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేస్తుంది. ఈ మేరకు గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో నివసించే సంచార జాతులకు చెందిన యవతకు ఆర్థిక చేయ్యూత ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలలో సముచితమైన భాగస్వామ్యం కల్పించేందుకు అనువైన విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ అత్యంత ప్రాచీనమైన కుల వృత్తులను ఇతోధికంగా ప్రొత్సహించే పథకాలను ప్రవేశపెట్టారు. తద్వారా బిసి వర్గాలు స్వలంబన దిశగా కార్పొరేషన్ కార్యచణ ప్రణాళికలను రూపొందించి, అమలు చేస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ కుమార్ వెల్లడించారు.

మారుమూల ప్రాంతాలల్లోని సంచార జాతుల ఆర్థిక అవసరాలను మెరుగపరిచేందుకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఆటోలు అందించే పథకం కార్యచరణ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం వ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలో అర్హులైన లబ్ధిదారుల ఖరారు ప్రక్రియను త్వరిగత గతిన పూర్తి చేయాలని యోచిస్తున్నామని వివరించారు. ఈ మేరకు లబ్ధిదారుల సమూహాలతో ప్రత్యేకంగా నూతన పథకం కార్యచరణ ప్రణాళిక పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అలాగే లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం జిల్లాల వారీగా నివేదికలను తయారు చేస్తున్నామని తెలిపారు. మొదటి విడుతలో 30నుంచి40మంది అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతు మీదుగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు.

ఈ పథకంలో 60శాతం ప్రభుత్వ సబ్సీడి…

రాష్ట్ర బిసి ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా మొదటి విడుత పంపిణి చేయు ఎలక్ట్రికల్ ఆటో రిక్షా పథకంలో 60శాతం ప్రభుత్వ సబ్సీడి అందజేయాలని ప్రతిపాదించామన్నారు. ఈ పథకంలో అర్హులైన లబ్ధిదారులు కేవలం 5శాతం వాటా నిధులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. మిగితా35శాతం నిధులను బ్యాంక్ లింకెజి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ ఆటో రిక్షా పథకంలో అత్యంత ప్రధానమైన సంచార జాతులైన జంగం, దాసరి, బుడుబుడుకలు,వంశరాజులు తదితర సంచార జాతుల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఆయన వివరించారు.

Electric Autos for Nomadic Tribes in Telangana