Home తాజా వార్తలు విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ హత్య

విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ హత్య

murderరాజన్న సిరిసిల్ల : ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ సబ్‌స్టేషన్ లో  ఆపరేటర్ గా పని చేస్తున్న  శ్రీనివాస్‌ అనే యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు.  శ్రీనివాస్ స్వస్థలం ఇల్లంతకుంట మండలం వంతదుపుల గ్రామమని పోలీసులు తెలిపారు. పాత కక్షల కారణంగానే శ్రీనివాస్‌ ను దుండగులు హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం శ్రీనివాస్‌ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Electric Substation Operator Murder In Rajannasircilla