Tuesday, April 23, 2024

గ్రేటర్‌లో పెరగనున్న విద్యుత్ వాహన స్టేషన్లు

- Advertisement -
- Advertisement -

Electric vehicle stations to grow in greater hyderabad

త్వరలో 11 స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు… స్థలాన్వేషణలో అధికారులు

హైదరాబాద్: రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా విద్యుత్ వాహనాలను వినియోగించేందుకు ముందుకు వస్తున్నారు. దీన్నిదృష్టిలో పెటుకుని అధికారులు అందుకు తగ్గ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వాటికి అవసరమయ్యే చార్జింగ్ స్టేషన్లను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్ర స్తుతం నగరంలో ఖైరతాబాద్‌లోని ఇంజినీర్స్ భవన్‌తో సహా విద్యుత్ సౌధ, బిఆర్కేభవన్, ముషీరాబాద్ బస్‌డిపో, ఉప్పల్ బస్‌డిపో, నిమ్స్, సిఐటిడి వంటి ప్ర భుత్వ రంగ సంస్థల్లో 67 చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకు వచ్చారు. వీటికి టిఎస్‌ఎస్‌పిడిసీఎల్ (దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ) నుంచి 7.5 కిలో వాట్స్ సామర్ధం ఉన్న విద్యుత్ కనెక్షన్లను తీసుకుని యూనిట్‌కు రూ.6 చొప్పున సంస్థకు చా ర్జీలు చెల్లిస్తున్నారు.

చార్జింగ్‌కు వచ్చిన హహనదారుల నుంచి స్లాబ్ రేట్‌ను బట్టి యూనిట్‌కు రూ.12 చొ ప్పున చార్జీ వేసుతన్నారు. పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే విద్యుత్ చార్జింగ్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. వి ద్యుత్ వాహనాలపై ఆసక్తి ఉన్నా అనేక మందికి చార్జింగ్ ఎలా చేసుకుకోవాలనే అనే అంశంపై అనుమానాలు ఉన్నాయి. అన్ని చోట్ల చార్జింగ్ సదుపాయా లు అందుబాటులో ఉంటాయో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకని చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం విద్యుత్ వాహనదారులకు 67 చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చినా మరో 138 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటికోసం స్థలాలను కూడా అన్వేషించే పనిలోఅధికారులు ఉన్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న 138 చార్జింగ్ స్టేషన్లలో సుమారు 118 స్టేషన్లు ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయనున్నారు. ఇవి కూడా అందుబాటులోకి స్తే గ్రేటర్ 185 చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. అంతే కాకుండా ప్రభుత్వం ప్రవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా 600 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు.ఇందు కోసం ఆసక్తి ఉన్నవారి నుంచిటెండర్లను పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమచారం.

ప్రయోజనాలు

సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే విద్యుత్ వాహనాల నిర్వహణ ఖర్చు చాలా త క్కువ. విద్యుత్ బైక్‌పై కేవలం రూ.6 ఖర్చుతో 80 కిలో మీటర్ల ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే గ్రేటర్‌లో 2230 ద్వి చక్ర వాహనాలున, 404 కార్లు, 67 ట్యాక్సీలు, 21 ఆ టోలు, 365 గూడ్స్ వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరిన్నిచార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వసే వీటి సంఖ్య అధికం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News