Friday, April 19, 2024

ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చు తక్కువ: జయేశ్ రంజన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ద్వారా చాలా ఉపయోగాలున్నాయని పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్ తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో జరిగిన తెలంగాణ ఇవి సమ్మిట్‌లో జయేశ్ రంజన్ మాట్లాడారు. ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువ అని, నూతన కంపెనీలను ఆకర్షించేలా నూతన విధానం తీసుకొచ్చామని, తయారీదారులు, పెట్టుబడిదారులకు భారీగా రాయితీలు కల్పించేలా నూతన విధానం చేపట్టామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల అవసరాలు తీర్చేలా చట్టాల్లో ప్రభుత్వాలు మార్పులు చేశాయన్నారు. నివాస సముదాయాలు, షాపింగ్ మాల్స్, బస్టాండ్‌లలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రారంభంలో రిజిస్ట్రేషన్ ఫీజు, లైఫ్ ట్యాక్స్‌లో మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. ఐదు కంపెనీలతో ఇవాళ ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, రవాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News