Friday, April 26, 2024

విద్యుత్ వైర్లు తగిలి బైక్ దగ్ధం

- Advertisement -
- Advertisement -

Electric wires hit and bike caught fire

గద్వాల్: విద్యుత్ వైర్లు తగిలి బైక్ దగ్ధమైన సంఘటన కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పాగుంట గ్రామానికి చెందిన కావలి స్వామి టివిఎస్ స్టార్ సిటి వాహనంపై తన పొలం పనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి బయలు దేరాడు. మార్గమద్యంలో విద్యుత్ వైర్లు తెగిపడి ఉండటం గమనించని వాహనదారుడు అలాగే వెళ్తుండగా విద్యుత్ వైర్లు వాహనానికి తగిలి షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే వాహనాన్ని వదిలి దూరం వెళ్లాడు. దీంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. వాహనాదారునికి పెనుప్రమాదం తప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News