Wednesday, April 24, 2024

విద్యుత్‌శాఖ అధికారులేదే ఇష్టారాజ్యం

- Advertisement -
- Advertisement -

విద్యుత్ షాక్‌కు గురైన వ్యక్తి చేయి తొలగింపు
పట్టించుకోని పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు
బినామీలతో పనులు
వేలల్లో జీతాలు

Electrical department fraud in Kothagudem

మన తెలంగాణ/కొత్తగూడెం : చట్టం ఏజెన్సీలో కొందరికి చుట్టంగా మారింది. కొన్ని శాఖల అధికారులు లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారుచెలకలో ఒక వ్యక్తి చేతుల్లో చిక్కి విలవిల్లాడుతోంది. ఆయనకున్న రాజకీయ అండదండల వల్ల పేదలు, కొన్నిశాఖల కింది స్ధాయి ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఆ వూరిలో ఏం జరిగినా బయటకు రాకుండా అక్కడ అందరి నోరు నొక్కేస్తున్నారు. ఫలితంగా ఏం జరిగినా బాహ్య ప్రపంచానికి తెలియటం లేదు. తెలిసినా అధికారులు ఏం చేయలేని నిస్సహాయ స్ధితిలో ఉంటున్నారన్న విమర్శలున్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారుచెలక ప్రాంతం ప్రత్యేక చట్టం పరిధిలో ఉన్నట్లు ఉంది. అందువల్ల అక్కడ కొందరు వ్యక్తుల ఇష్టారాజ్యం నడుస్తొంది.

కొందరు పెద్దల అండదండతో ఇంకా రెచ్చిపోతున్నారు. అక్కడ గతంలో జరిగిన చిన్నారులపై అత్యాచారం కేసును సైతం రాజీకి ఆ ప్రాంత నాయకులు ప్రయత్నించి మసిపూసి మారేడు కాయ చేయాలనుకున్నారంటే వారికున్న పలుకుబడి ఏ పాటిదో అర్దం చేసుకోవచ్చు. తాజాగా విద్యుత్ శాఖ అధికారులు నిర్లిప్తత నిర్లక్షం కారణంగా ఒక వ్యక్తి విద్యుత్‌షాక్ కు గురై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. వళ్లంతా కాలిపోయింది. ఇప్పటికే ఆపరేషన్ చేసి ఒక చేయి తొలగించారు. బంగారు చెలక ప్రాంతంలో విద్యుత్ సమస్య ఏది ఏర్పడ్డ ఒక వ్యక్తి చెప్పుచేతల్లోనే అన్ని పనులు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి కొందరు ప్రైవేటు వ్యక్తులను పెట్టి పనులుచేయిస్తు, విద్యుత్ శాఖ అధికారుల పనులు చక్కబెడుతున్నారు. ఆ వూరికి లైన్‌మన్, లైన్ ఇన్‌స్పెక్టర్ చాలా అరుదుగా వెళ్తారట. ఇంకా పెద్ద అధికారులు గురించి ఎంత తక్కువ చెబితే అంతమంచింది. ఈ ఫలితంగా బంగారుచెలక సమీపంలోని లక్ష్మీపురంలో లో రెండు రోజుల కిందట తాటి రాంబాబు అనే వ్యక్తి పోల్ ఎక్కాడు. అయితే అదే సందర్బంగాలో విద్యుత్ సరఫరా జరిగింది. దీనితో రాంబాబుకు విద్యుత్ షాక్‌తో తీవ్ర గాయాలయ్యాయి.

అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఇటు గ్రామ్తులు, విద్యుత్ శాఖ అధికారులు రహస్యంగా ఉంచారు. మన తెలంగాణ పత్రికలో గురువారం ఈ వార్త ప్రచురింత అయ్యాక విషయం ప్రజలకు, బయటి ప్రపంచానికి తెలిసింది. అయితే ఇలా వ్యక్తి పోల్ పై ఉన్నప్పుడు విద్యుత్ సరఫరాకు కారకులెరు, అసలుప్రైవేట వర్కర్లను పనికి ఎవరు తీసుకెళ్లారనేది విద్యుత్ శాఖ అధికారులు తేల్చలేదు. ఇంతరు బాధితుడిని కనీసం ఆ శాఖ అధికారులు పరామర్శించలేదు. ఖమ్మంలో ఒక ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రాంబాబును లక్ష్మీదేవిపల్లి జడ్పీటీసి మేరెడ్డి వసంతక్క, నాయకులు మెరెడ్డి జనార్దనరెడ్డి శు క్రవారం పరామర్శించారు. విద్యుత్ శాఖ, డీఈఈ, ఏఈ ని కలిశారు.

కాగా ఈ విషయమై ఆ ప్రాంత విద్యుత్ ఏఈని ఫోన్‌లో మనతెలంగాణ ప్రతినిధి సంప్రదించగా పోల్ ఎక్కవద్దని వారిస్తున్నా, రాంబాబు పోల్ ఎక్కారని చెప్పారు. తను కొత్తగా బాధ్యతలు తీసుకున్నానని అన్నారు. ఆ ప్రాంతానికి లైన్‌మన్, లైన్ ఇన్‌స్పెక్టర్ వెళ్లనిది తనకు పూర్తి వివరాలు తెలుసుకుంటానన్నారు. బాధితునికి పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తున్నానన్నారు. కాగా ఈ సంఘటనపై శుక్రవారం రాత్రి వరకు ఎటువంటి పోలీసు కేసు అయినట్లు పోలీసు శాఖ ప్రకటించలేదు. ఇప్పటికైన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇటువంటి అనధికారికి కార్యక్రమాలకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తులే పోల్స్ ఎక్కడం, ఎల్‌సి తీసుకోవడం, డిపిలు ఆన్ ఆఫ్‌చేయడం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కొంత కాలం ఈ వ్యవహారం సద్దుమణుగుతోంది. తర్వాత పరిస్థితి యధాతధంగా ఉంటోంది. అత్యధికంగా జీతాలు తీసుకునే సిబ్బంది తక్కువ జీతాలకు ఊర్లలో బినామీలను పెట్టుకుని పనులు చేయిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News