Saturday, April 20, 2024

ఎసిబి వలలో సబ్‌ఇంజనీర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి

- Advertisement -
- Advertisement -

Electricity sub-engineer and outsourcing employee caught by ACB

 

మనతెలంగాణ/హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా కీసర విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ విజయేందర్‌రెడ్డి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సంతోష్‌లు రూ. 13 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం నాడు ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా బీరంగూడకు చెందిన శశికుమార్ రెడ్డి కీసర మండలం నాగారంలోని వైష్ణవి కన్‌స్ట్రక్షన్‌లో ట్రాన్స్‌ఫార్మర్స్, మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్స్, మీటర్లు మంజూరు కావాలంటే రూ.20 వేలు ఇవ్వాలని సబ్ ఇంజినీర్ విజయేందర్ రెడ్డి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు శశికుమార్‌రెడ్డి రూ. 13వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు.

కాగా శశికుమార్ రెడ్డి ఈనెల 12వ తేదీన విద్యుత్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సంతోష్‌కు ఫోన్‌పే ద్వారా రూ. 6వేలు చెల్లించాడు. తిరిగి సబ్‌ఇంజినీర్ రూ. 13వేలు డిమాండ్ చేయడంతో శశికుమార్‌రెడ్డి ఎసిబి అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు సబ్‌ఇంజినీర్ విజయేందర్ రెడ్డి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం సబ్‌ఇంజినీర్ విజయేందర్‌రెడ్డి చేతి వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించి అరెస్ట్ చేశారు. ఈక్రమంలో లంచం కేసులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సంతోష్, విజయేందర్‌రెడ్డిలను ఎసిబి కోర్టులో హాజరుపర్చడంతో నిందితులకు 14 రోజలు రిమాండ్ విధించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News