Tuesday, April 23, 2024

ఎలెన్ థామ్సన్ కొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

Ellen Thomson wins gold in the women's 100m

టోక్యో: జమైకా స్టార్ అథ్లెట్ ఎలెన్ థామ్సన్ మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో సరికొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణం సొంతం చేసుకుంది. శనివారం జరిగిన 100 మీటర్ల పరుగు ఫైనల్లో ఎలెన్ థామ్సన్ 10.61 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో అతి తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకున్న రెండో అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. ఆమెకన్నా ముందు 1988 ఒలింపిక్స్‌లో గ్రిఫిత్ జాయ్‌నర్ 10.49 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని అరుదైన రికార్డును నమోదు చేసింది. కాగా ఈ పోటీల్లో షెల్లీ అన్నా ఫ్రాసెర్ రజతం, షెరికా జాక్సన్ కాంస్య పతకాలను సాధించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News