Home తాజా వార్తలు బాసర ట్రిపుల్ ఐటికి అత్యవసర సెలవులు

బాసర ట్రిపుల్ ఐటికి అత్యవసర సెలవులు

Emergency holidays for IIIT Basar

నిర్మల్: విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటికి అధికారులు మంగళవారం ఉదయం అత్యవసర సెలవులు ప్రకటించారు. పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇక సోమవారం ట్రిపుల్ ఐటిలో సమస్యలపై విద్యార్థులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యార్థులు శాంతియుత నిరసన తెలిపారు. మంగళవారం కూడా నిరసనకు దిగుతామని విద్యార్థులు వెల్లడించారు. సమస్యలపై గవర్నర్ నరసింహన్ తో పాటు మంత్రి కెటిఆర్ తో మాట్లాడించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉపకులపతి అశోక్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన విద్యార్థులు ఆందోళన విరమించలేదు. విసి అశోక్ హామీతో సంతృప్తి చెందని విద్యార్థులు ఇవాళ మళ్లీ ఆందోళనకు దిగుతామని వెల్లడించడంతో అధికారులు అత్యవసర సెలవులు ప్రకటించారు. ఇళ్లకు వెళ్లిపోవాలని విద్యార్థులకు అధికారులు ఔట్ పాస్ లు జారీ చేశారు. తరగతి గదులు, వసతి గృహాలను అధికారులు మూసివేశారు. అలాగే వసతి గృహాలకు నీటి సరఫరాను కూడా నిలిపివేశారు. అయితే, తమ 17 ప్రధాన సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు ట్రిపుల్ ఐటి క్యాంపస్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. గతంలోనూ చాలాసార్లు హామీలిచ్చిన నెరవేర్చలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

Telangana Breaking News