Home వార్తలు భావోద్వేగాలు, బాంధవ్యాల ‘బ్రహ్మోత్సవం’

భావోద్వేగాలు, బాంధవ్యాల ‘బ్రహ్మోత్సవం’

ఈ వేసవిలో నాలుగు పెద్ద సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తోంది టాప్ హీరోయిన్ సమంత. అందులో ఒకటైన ‘బ్రహ్మోత్సవం’లో ఆమె మహేష్ హీరోయిన్లలో ఒకరిగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో సమంతతో ఇంటర్వూ…

brahmotsavamకథే మేజర్ హైలైట్
ఇటు టాలీవుడ్‌లో అటు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. మహేష్‌తో ‘బిజినెస్‌మేన్’ వంటి సూపర్‌హిట్ మూవీలో నటించిన ఈ భామ ‘బ్రహ్మోత్సవం’లో అతనికి జంటగా నటిస్తోంది. ఈ సందర్భంగా కాజల్ చెప్పిన సినిమా విశేషాలు…
పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…
మహేష్, నేను కలిసి ఇదివరకు చేసిన ‘బిజినెస్‌మేన్’ సినిమాకూ, ఈ సినిమాకు అస్సలు పోలిక ఉండదు. ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. శ్రీకాంత్ అడ్డాల రాసిన అద్భుతమైన కథే ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు.
ఎన్నారై అమ్మాయిగా…
ఈ సినిమాలో నేను ఓ ఎన్నారై అమ్మాయిగా కనిపిస్తా. మామూలుగా మన సినిమాల్లో ఎన్నారై అమ్మాయి అంటే ఆ పాత్ర కాస్త అతిగా కనిపిస్తుంటుంది. దర్శకుడు మాత్రం ఈ క్యారెక్టర్‌ను చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఈ తరం ఆలోచనలు, స్వతంత్య్ర భావాలున్న అమ్మాయి పాత్రలో నటించడం చాలా కొత్తగా కనిపించింది.
నాకు చాలా స్పెషల్…
శ్రీకాంత్ అడ్డాల ఈ కథ చెప్పినప్పుడు చెయ్యాలా… వద్దా అని ఆలోచించా. నాకున్న అనుమానాలన్నీ తీర్చుకున్నాక… ఈ సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నా. ఈ సినిమాలో నేను చేసిన రోల్ ఇదివరకు చేయలేదు. దీంతో ఈ రోల్ నాకు చాలా స్పెషల్.
చక్కగా నటించగలిగాను…
సినిమాలో నా పాత్ర ఎలా ఉంది? దానికి ప్రాధాన్యం ఎలా ఉంది? అన్నదే ముఖ్యం. ‘బ్రహ్మోత్సవం’ కథ ప్రకారం ఇందులో పాత్రలే కనిపిస్తాయి. ఈ విధంగానే మిగతా హీరోయిన్లు సమంత, ప్రణీతలతో కలిసి చక్కగా నటించగలిగాను. అలాంటప్పుడు మల్టీస్టారర్ అయినా, మరింకేదైనా మనం ఇబ్బందిగా ఫీలవ్వడానికి ఏమీ లేదు.
మహేష్‌ను చూసి నేర్చుకోవాలి…
‘బిజినెస్‌మేన్’తో పోలిస్తే మహేష్ ఇప్పుడింకా యంగ్ అయిపోయారు. విజువల్స్ చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఇక ఒక నటుడిగా ఒక్కో సినిమాకు ఎదుగుతూ వెళ్లడం మహేష్‌ను చూసి నేర్చుకోవాలి. సూపర్‌స్టార్ అయినా నటన విషయంలో ఎప్పుడూ పూర్తి స్థాయిలో మెప్పించాలని ఆయన ప్రయత్నిస్తుంటారు. సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ క్యూట్‌గా ఉంటుంది.
పివిపి కృషి చాలా బాగుంది…
పివిపి ఎన్నో సినిమాల అనుభవం ఉన్న వారిలా సినిమాను చాకచక్యంగా పూర్తిచేస్తుంటారు. స్క్రీన్‌నిండా స్టార్స్ ఉండే సినిమాను ఇలా పకడ్బందీగా పూర్తిచేయడంలో పివిపి టీమ్ చేసిన చాలా కృషి చాలా బాగుంది.
అందరూ ఎంజాయ్ చేయగలిగేలా…
కథ, మహేష్ చరిష్మా ఈ సినిమాకు మేజర్ హైలైట్స్. ఇకపోతే కలర్‌ఫుల్ సీన్స్, సినిమా నిండా కనిపించే స్టార్స్, అందమైన కుటుంబ బంధాలు… ఇవన్నీ అన్ని రకాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు. ఈ సమ్మర్‌లో అంతా కలిసి ఎంజాయ్ చేయగలిగేలా ఉంటుంది ఈ సినిమా.

మహేష్ యంగ్‌గా కనిపిస్తారు

బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది…
ఈ సమ్మర్ నాకెంతో స్పెషల్. నేను చేసిన 24, తెరి సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు ఘన విజయం సాధించాయి. ఆతర్వాత ఈనెల 20న వస్తున్న ‘బ్రహ్మోత్సవం’ నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. ఇక నేను ప్రతి సినిమాను మొదటి సినిమాగా భావించి మంచి పర్‌ఫార్మెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. అదే నా సక్సెస్‌కు కారణం.
గర్వంగా ఉంది…
‘బ్రహ్మోత్సవం’ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో… నేనూ అంతే ఎదురుచూస్తున్నా. ఇదో ఉత్సవంలాంటి సినిమా. ఇలాంటి సినిమా తీయాలన్న ఆలోచన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు రావడం…మహేష్ దాన్ని ముందుండి చేయడంతో ఇద్దరినీ అభినందించాల్సిందే. ఈ సినిమాలో అద్భుతమైన భావోద్వేగాలు, కుటుంబ బంధాలు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో నడిచే కథలో నేనూ ఓ భాగమవ్వడం గర్వంగా ఉంది.
మా జర్నీ బాగుంటుంది…
మహేష్‌లాంటి స్టార్ హీరోతో మళ్లీ మళ్లీ కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఈ సినిమాలో మునుపటి కంటే యంగ్‌గా కనిపిస్తారు. ఈ సినిమాలో మా ఇద్దరి జర్నీ కూడా చాలా బాగుంటుంది. సెకండాఫ్‌లో మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటాయి.
అందరికీ నచ్చుతుంది…
ఈ సినిమాలో నేను ఓ తెలివైన, సంప్రదాయబద్ధమైన అమ్మాయిగా కనిపిస్తా. ఉన్నతంగా ఆలోచించే మనస్తత్వమున్న అమ్మాయి పాత్రను డిజైన్ చేసిన విధానం, ఆ పాత్ర నేపథ్యంలో నడిచే ప్రయాణం నాకు చాలా బాగా నచ్చాయి. నా రోల్ ప్రేక్షకులందరికీ నచ్చుతుందన్న నమ్మకముంది.
కథే స్టార్…
‘బ్రహ్మోత్సవం’ అనేది ఓ పెద్ద కథ. ఇలాంటి కథలో నేను, కాజల్, ప్రణీతలంతా పాత్రలమే. కథే ఈ సినిమాకు స్టార్. ప్రతి పాత్రకూ ఓ ప్రాధాన్యత ఉన్నప్పుడు ఎక్కడా, ఎవరితోనూ ఇబ్బంది అనేది ఉండదు. ఈ సినిమాలో నాకు బాల త్రిపురమణి అనే పాటంటే పిచ్చి ఇష్టం. ఆ పాట విజువల్స్ అద్భుతంగా ఉంటాయి.
శ్రీకాంత్ అడ్డాల బ్రాండ్ మార్క్ సినిమా…
మనిషి ఆలోచన, భావోద్వేగాలను సరిగ్గా పట్టుకోవడంలో ఆయన మాస్టర్ ఏమో అనిపిస్తుంటుంది. ఈ సినిమాలో రేవతి, నాకు మధ్య ఒక సన్నివేశం ఉంటుంది. నేను నటించాల్సిన అవసరం లేకుండా ఆ సన్నివేశమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు చాలా ఉంటాయి. శ్రీకాంత్ అడ్డాల బ్రాండ్ మార్క్ సినిమా ‘బ్రహ్మోత్సవం’ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.