Friday, March 31, 2023

ఎంప్లాయిమెంట్ కార్డు అవస్తలు..!

- Advertisement -

card* డిఇఓలకు అధికారాలు ఇవ్వకుండానే వెబ్‌పోర్టల్ తయారీ
* సరిగ్గా పనిచేయని ఆన్‌లైన్ వ్యవస్థ
* జనవరి 1నుండి నిలిచిపోయిన ఎంప్లాయ్‌మెంట్ కార్డులు
* ఎంప్లాయ్‌మెంట్ కార్డుల కోసం నిరుద్యోగుల తిప్పలు
* ఉద్యోగావకాశాలు కోల్పోతున్న అభ్యర్థులు

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది.. అన్నట్లు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయ్‌మెంట్ కార్డుల నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ చేయడం నిరుద్యోగులకు శాపంగా మారింది. దీంతో ఉద్యోగావకాశాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారుల హడావుడి నిర్ణయాల వల్ల ఎంప్లాయ్‌మెంట్ కార్డుల కోసం నిరుద్యోగ యువతీ, యువకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఇప్పటి వరకు ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే వారం రోజుల్లో పోస్టు ద్వారా లభించే ఎంప్లాయ్‌మెంట్ కార్డులు కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి నిలిచిపోయాయి. ప్రజలు అనేక వ్యయప్రయాసాలకు గురై తమ సొంత గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల్లో ఉండే ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయాలకు వచ్చి కార్డుల కోసం ఇబ్బందులు పడాల్సి పని లేదని, జనవరి 1వ తేదీ  నుంచి తమ తమ ప్రాంతాల్లోనే ఇంటర్నెట్ , మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకొని అక్కడే కార్డులు పొందవచ్చనిచెప్పిన అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు మాత్రం పూర్తి చేయలేకపోయారు.

రాష్ట్ర వ్యాప్తంగా డబ్లూడబ్లూడబ్లూ.ఎంప్లాయ్‌మెంట్.తెలంగాణ.జిఓవి.ఇన్(www.employeement.telangana.gov.in) వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ అయితే ప్రారంభించారు. కానీ అందులో ఆప్షన్లు సరిగ్గా పనిచేయకపోవడంతో అభ్యర్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక గత పక్షం రోజులుగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో ఉన్న ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయాలకు, మీ సేవాకేంద్రాలకు నిరుద్యోగులు ఎంప్లాయ్‌మెంట్ కార్డుల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారు. చాలా సందర్బాల్లో వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని, ఓపెన్ అయినా పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినప్పటికీ సంబంధిత ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయాలకు సమాచారం వెళ్లకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రకటనలు ఇవ్వడంతో పాటు దరఖాస్తుదారుడు విధిగా తన పేరును ఎంప్లాయ్‌మెంట్ ఎక్చేంజ్‌లలో నమోదు చేసుకొని ఉండాలనే నిబంధన పెట్టడంతో కార్డుల కోసం అభ్యర్థులు పడుతున్న కష్టాలు అనేకం. ఆన్‌లైన్‌లో రావడం లేదు, కార్డులు కావాలని ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయాలకు వెళ్లితే అది తమ చేతిలో లేదని, రికార్డు అంతా డైరెక్టరేట్ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయానికి పంపించామని సంబంధిత అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా దరఖాస్తు చేసుకొనే వారి విషయం ఇలా వుంటే, డిసెంబర్ చివర వారంలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని వివిధ  గ్రామాలకు చెందిన నిరుద్యోగులు తమ దరఖాస్తులను కార్యాలయాల్లో ఇస్తే పోస్టు ద్వారా పంపుతామని సమాధానంచెప్పిన అధికారులు ఇప్పుడు వాటిని కూడా తాము క్లియర్ చేసే పరిస్థితి లేదని అంటున్నారు. ఉన్నతాధికారులు తయారు చేసిన వె బ్ సైట్‌లో దరఖాస్తులను క్లియర్ చేయడానికి తమకు అధికా రం ఇవ్వలేదని ఎంప్లాయ్‌మెంట్ అధికారులు అంటున్నారు. అధికారుల సమాధానాలు కూడా బాధ్యతా రహితంగా వుండటంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎం ప్లాయ్‌మెంట్ కార్డులు సకాలంలో రాకుంటే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొనే గడువు కూడా ముగిసిపోతుందని, తర్వాత వచ్చినా ప్రయోజనం లేకుండాపోతుందని నిరుద్యోగులు వా పోతున్నారు. ప్రస్తుతం ఎల్‌ఐసి, ట్రాన్స్‌కో తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైం ది. ఈ ఉద్యోగాల కోసం ఎంప్లాయ్‌మెంట్ కార్డులు జత చేయ డం తప్పనిసరి కావడంతో అభ్యర్థులంతా ఎంప్లాయ్‌మెంట్ కా ర్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వీరికి స కాలంలో కొత్తవి రాకపోగా, ఉన్న కార్డులు రిన్యువల్‌కాకపోవ డం వల్ల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఎంప్లాయ్‌మెంట్ కార్డులు తీసుకోవాల ని చెప్పిన అధికారులు, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అధికారుల డిజినటల్ సంతకాలను కూడా అప్‌లోడ్ చేయలేదు. దీంతో ఆన్‌లైన్ సమస్యలు తీవ్రతరమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News