Sunday, May 19, 2024

జంగల్ బచావో, జంగల్ బడావో నినాదం స్పూర్తిని కొనసాగించాలి

- Advertisement -
- Advertisement -

pccf

 

హైదరాబాద్ : పర్యావరణ రక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు అందరూ నిజాయితీగా, అంకితభావంతో పనిచేయాలని ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పిసిసిఎఫ్) ఆర్. శోభ పిలుపు నిచ్చారు. అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ ఇచ్చిన జంగల్ బచావో, జంగల్ బడావో నినాదం స్ఫూర్తిని కొనసాగించాలని, సమయ పాలన పాటిస్తూ నిబద్ధతతో పనిచేయటం ఒక్కటే అటవీ శాఖలో ప్రతీ ఒక్కరి ప్రాధాన్యతగా ఉండాలని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి ఉద్యోగులందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ అటవీ అధికారుల సంఘం తయారు చేసిన క్యాలెండర్ ను ఉన్నతాధికారులు ఆవిష్కరించారు. పిసిసిఎఫ్ (వైల్డ్ లైఫ్) మునీంద్ర, అదనపు పిసిసిఎఫ్‌లు లోకేష్ జైస్వాల్, పర్గెయిన్, సిసిఎఫ్ సునీతా భగవత్, ప్రత్యేక అధికారి తిరుపతయ్య ఇతరు అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని పరస్పరం కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Employees all works Dedicatedly
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News