Home తాజా వార్తలు అనంత్‌నాగ్‌లో ఎదురుకాల్పులు

అనంత్‌నాగ్‌లో ఎదురుకాల్పులు

armyశ్రీనగర్ : జమ్మూకశీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా అవూరా గ్రామంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరిగా ఎదురు కాల్పులు జరిగాయి. అవూరా గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారంటూ భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి సమాచారం ఇంకా తెలియరాలేదు.