Home తాజా వార్తలు బటమాలో ఎదురుకాల్పులు

బటమాలో ఎదురుకాల్పులు

Encounter

శ్రీనగర్:  జమ్ముకశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లోని బటమాలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఒక ఇంట్లో  తీవ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో జమ్మూ పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎస్‌వొజి బాయ్ వీరమరణం పొందగా ఓ పోలీసు, ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు  తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల నేపథ్యంలో బటమాలో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు.