Home రాష్ట్ర వార్తలు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్

మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్

ముగ్గురు మావోయిస్టులు మృతి, ఇద్దరు ఆదిలాబాద్ జిల్లా వారు

encounterమంచిర్యాల : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహెరి తాలూకా పరిధిలో లక్క గుట్టల్లో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. అం దులో ఇద్దరు ఆదిలాబాద్ జిల్లా వాసులే. తిర్యా ణి మండలం రోంపల్లి గ్రామానికి చెందిన ఆత్రం శోభన్ ఆలియాస్ చార్లిస్, మరో వ్యక్తి దీపక్‌గా గుర్తించారు. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు మహారాష్ట్ర అహెరి తాలూకా పరిధిలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్ మహారాష్ట్ర, తెలంగాణ గ్రేహౌండ్స్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో భా గంగా జరిగినట్లు తెలుస్తోంది. మరొకరు మహారాష్ట్రకు చెందిన ముకేష్‌గా అక్కడి పోలీసులు గుర్తించారు.
ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు ఎదురు దెబ్బ
గడ్జిరోలిలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి అలజడి లేకు ండా సబ్ధతగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఆత్రం శోభ న్ ఆలియాస్ చార్లిస్ మహారాష్ట్ర దళంలో పనిచేస్తూ ఈ ప్రాంతంలో అలజడి సృష్టించడం ఇక్కడ పోలీసులకు సవాలుగానే మారింది. గత కొద్ది నెలల క్రితం తిర్యాణి మండలంలో బల్లార్ష అనే యువకుడిని ఇన్‌ఫార్మర్ నెపంతో కాల్చి చంపడం , ఏప్రిల్ నెలాఖరులో బెజ్జూర్ మండలం గూడెం వంతెన నిర్మాణ స్థలంలో వాహనాలకు నిప్పు పెట్టడం లాంటి విషయాలను ఇక్కడి పోలీసులు సవాలుగా తీసుకున్నారు. గూడెం వంతెన నిర్మాణ స్థలంలో వా హనాలు తగలబెట్టిన సంఘటనపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సైతం అప్రమత్తం కావడంతోపాటు గూడెం గ్రామ సమీపంలో సంఘటనా స్థలా న్ని స్వయంగా పరిశీలించారు. అప్పటి నుండి మావోయిస్టు కార్యకలాపా లపై దృష్టిసారించిన పోలీసులు అప్రమత్తంగా తమ వ్యూహాన్ని కొనసాగిం చారు. కాగా శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో గూడెం గ్రామంలో కీలక పాత్ర వహించిన మావోయిస్టు ఆత్రం శోభన్ అలియాస్ చార్లిస్ మృతి చెందారు. గూడెం గ్రామ సమీపంలో వంతెననిర్మాణానికి చెందిన వాహనా లను ఏప్రిల్ నెలలో ఆత్రం శోభన్ ఆలి యాస్ చార్లిస్ మరి కొంత మంది మావో యిస్టులతో కలిసి యంత్రాలకు నిప్పు పెట్టడంతో అభివృద్ధి కుంటుపడింది. తెలం గాణ, మహారాష్ట్రల మధ్య అంతరాష్ట్ర రోడ్డు రవాణా మార్గం కల్పించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన ప్రాణహితపై వంతెన నిర్మాణాలు మావోయిస్టుల కార్యకలాపాల వల్ల కుంటుపడింది. దీంతో పా టు మరికొన్ని అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. దీన్ని దృష్టిలో పెట్టు కున్న పోలీసులు ప్రాణహిత పరిసర ప్రాంతాలతో పాటు పరిసర గ్రామా ల్లోనూ మావోయిస్టులకు ఆశ్రయం లభించకుండా అప్రమత్తం కావడంతో పాటు ఆయా గ్రామాల్లో పోలీసుల జనమైత్రి గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అందులో భాగంగానే కొన్ని అభివృ ద్ధి పనులు పోలీసులు పూర్తి చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. మావోయిస్టులతో అభివృద్ధి కుంటుపడుతున్నదన్న విషయాన్ని గమనించిన ప్రాణహిత పరిసర గ్రామాలైన గూడెం , చిత్తాం, శివపెల్లి, కేతిని, నాగెపల్లి, కోయపల్లి , తదితర గ్రామాలకుచెందిన వందలాది మంది ఇటీవల గూడెం గ్రామంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.