Home రాష్ట్ర వార్తలు వివాదాంతం…

వివాదాంతం…

disputes

 

ఎపి సిఎం జగన్మోహన్‌రెడ్డికి కాళేశ్వరం ఆహ్వానం అందించిన ముఖ్యమంత్రి కెసిఆర్
అనంతరం రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారంపై గంటన్నరపైగా చర్చించిన ఇద్దరు సిఎంలు

జలపేచీలపై చర్చల పంథా, స్థానికత ఆధారంగా ఉద్యోగుల బదిలీలు, ముందు విద్యుత్ తర్వాత పోలీసు అనంతరం 9,10 షెడ్యూళ్ల సంస్థల సిబ్బంది

విదుత్ బకాయిలపైనా సమాలోచన, పెండింగ్‌లోని అన్ని అంశాలనూ స్పృశించిన తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు 

హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా కొలిక్కి రాని వివాదాలకు సత్వర ముగింపు పలకాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చం ద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చారు. చాలాకాలంగా అపరిష్కృతం గా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సిఎ ంలు చర్చించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ప్రభుత్వరంగ సంస్థల విభజనపై దృష్టి పెట్టారు. అలాగే విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ బకాయిల పరిష్కారంపైనా చర్చలు జరిపారు.

ఇరు రాష్ట్రా ల మధ్య నెలకొన్న జల వివాదాలపైనా సమాలోచనలు జరిపారు. విభజన చట్టంలోని పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపైనా సానుకూల వాతావరణంలో ఇద్దరు సీఎం లు చర్చించినట్టు సమాచారం. సోమవారం విజయవాడ పర్యటనకు వెళ్లిన సిఎం కెసిఆర్ ఎపి సిఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యా రు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కా ర్యాలయానికి వెళ్లిన సిఎం కెఆర్‌ను ఎపి సిఎ ం సాదరంగా ఆహ్వానించి, దగ్గరుండి లోపలికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు సిఎంలు కలిసి భోజనం చేశారు. సిఎం కెసిఆర్ వెంట టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, మాజీ ఎంపి వినోద్ కుమార్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, టిఆర్‌ఎస్ నేత శేరి సుభాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఎపి మం త్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎంపి వై.వి.సు బ్బారెడ్డిలు భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన కీలక భేటీలో ఇరువురు ముఖ్యమంత్రులు విభజన సమస్యలపై చర్చించారు. ఇరువురు సిఎంలు సుమారు గంటన్నరకుపైగా వివాదాంతం అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్‌టిసి ఆస్తుల పంపకాలు, జల వివాదాలు, ఉద్యోగుల విభజన తదితర ముఖ్య అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఉద్యోగుల విభజనకు ఇరు రాష్ట్రాలలో అధికారులతో సంయుక్తంగా కమిటీ వేసి, పరస్పర అంగీకారంతో రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగులను స్థానికత ఆధారంగా బలిలీలు చేసుకుందామని ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది.

ముందు విద్యుత్ ఉద్యోగులు, ఆ తర్వాత పోలీసులు, షెడ్యూల్ 9,10 సంస్థల్లోని ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కోర్టులకు, ట్రిబ్యునళ్లకు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని ఇరువురు సిఎంలు ఈ భేటీలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 24న ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శుల సమావేశం హైదరాబాద్‌లో ఉంది. ఈ భేటీలో జలవివాదాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించనున్నారు. గతంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందు సందర్భంగా కూడా హైదరాబాద్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన సమస్యలపై చర్చించారు. అనంతరం సోమవారం జరిగిన కీలక భేటీలో ఈ సమస్యలపై చర్చించారు. దాంతో రాష్ట్ర విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా మరో ముందడుగు పడింది.

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ సిఎం కెసిఆర్ ఎపి సిఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పలికారు. ఈ మేరకు సిఎం కెసిఆర్ స్వయంగా ఆహ్వాన పత్రికను ఎపి సిఎంకు అందజేశారు.తన నివాసానికి వచ్చిన సిఎం కెసిఆర్,కెటిఆర్‌లను జగన్ శాలువాలతో సత్కరించి, వారికి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం కెసిఆర్, జగన్ కలిసి శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి ఒకే కారులో బయల్దేరి వెళ్లారు.

End of disputes between TS and AP states