Home వార్తలు మోడీ విధానాలపై ఉధృత పోరు

మోడీ విధానాలపై ఉధృత పోరు

National-Council-of-CPIఏప్రిల్‌లో పార్టీ నిర్మాణంపై పక్షోత్సవం
సిపిఐ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా నిర్ణయాలు

మన తెలంగాణ / గుంటూరు: మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, బడుగు, బలహీనవర్గాల వ్యతిరేక, కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలు, దేశంలో పెరుగుతున్న అధిక ధరలు, రైతుల ఆత్మహత్యలు తదితర సమస్యలపై దేశవ్యాప్తంగా విసృ్తత ప్రజాస్వామ్య ఐక్య వేదికను నిర్మించడం ద్వారా పోరా టాలను ఉధృతం చేయాలని సిపిఐ జాతీయ సమితి నిర్ణయించింది. గుంటూరులో మూడు రోజులపాటు జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారం ముగిశాయి. సమావేశ నిర్ణయాలను పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి ఆదివారం విలేకరుల సమా వేశంలో వెల్లడించారు. మోడీ సర్కార్ అనుసరిస్తున్న నయా ఉదారవాదం, విచ్ఛిన్నకర మతపరమైన విధా నాలకు వ్యతిరేకంగా కూడా పోరాటాలు నిర్వహించ నున్నట్లు ఆయన తెలిపారు. హిందుత్వ, సంఘ్‌పరివార్ పలుకుబడి గల మతోన్మాదశక్తుల్లో అసహనం ఇప్పటికీ తీవ్రంగా నెలకొందని, రాజ్యాంగ వ్యతిరేక పద్ధతిలో వారు ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. తమ ఆలోచన ధోరణులను, అభిప్రాయాలను, అంధ విశ్వా సాలను వ్యతిరేకించే రచయితలు, మేధావులపై దాడులు కొనసాగిస్తున్నారని చెప్పారు.

రచయితలు ఏ రచనలు చేయాలో, ప్రజలు ఏం తినాలో, ఏం తినకూడదో నిర్దే శిస్తున్నారని, ఇతర మతాలవారు వారి దయా దాక్షిణ్యా లపై బతకాలని వారు భావిస్తున్నారని పేర్కొన్నారు. మరోపక్క అఖండ్ భారత్ నినాదంతో భయభ్రాంతులను చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధాలను వ్యతిరేకిస్తున్న ప్రజలపై దాడులకు పాల్పడుతూ వారి అసహనాన్ని దేశ ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పైగా అసహనానికి వారు తప్పుడు నిర్వచనాన్ని, తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. ఇది అత్యంత ప్రమాదకర మైనదని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 5వ తరగతి, జిల్లా పరిషత్ ఎన్నికల్లో 8వ తరగతి చదివినవారు మాత్రమే పోటీ చేయడానికి అర్హులని హర్యానా ప్రభు త్వం ఇటీవల ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దాదాపు 34 శాతం వున్న దళితులు, ఒబిసిలు, మైనార్టీల్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాన్ని సుప్రీం కోర్టు ఆమోదించిచగా, దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం తిరిగి ఆలోచించవల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరాలని పార్టీ అభిప్రాయపడినట్లు సురవరం తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు లేనందువల్లే నిరక్షరాస్యులుగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో దారిద్య్రాన్ని నిర్మూలించ కుండా ఇటువంటి చట్టాలు తీసుకురావడం తగదని ఆయన పేర్కొన్నారు. కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాల్లో మరుగుదొడ్లు లేని కుటుంబాలు పోటీ చేయడానికి అనర్హులని కూడా చట్టాలు తెచ్చారు. గతంలో బ్రిటీషు పాలనలో బ్రిటన్‌లో ఒక చట్టం వుండేది. దాని ప్రకారం పన్ను చెల్లించేవారికి, సంపన్నులకు మాత్రమే పోటీ చేసే అర్హత వుండేది. తిరిగి బ్రిటీషు చట్టాన్నే తీసుకురా వడానికి బిజెపి ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో యత్నిస్తు న్నాయని ఆయన విమర్శించారు. దళితులకు, దారిద్య్రరే ఖకు దిగువన వున్నవారికి ఎన్నికల్లో పోటీచేసే అవకా శాల్లేకుండా చేయడమే లక్ష్యంగా కనపడుతోందన్నారు. ప్రతిపక్షాలు పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డు తగులుతున్నారని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తు న్నది. పార్లమెంటులో చర్చలు జరగకుండా ఆపగలిగే శక్తి వామపక్షాలకు లేదు. సమావేశాలు సజావుగా జర గాలని, అధిక ధరలు, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావు లపై చర్చించాలని కోరుతున్నాం. ప్రత్యక్ష పెట్టుబడులు, జిఎస్‌టి బిల్లుపై చర్చ జరగకపోవడంతో దేశాభివృద్ధి ఆగిపోయిందని వారు పేర్కొంటున్నారని, ఇది పచ్చి అబద్ధమని సురవరం అన్నారు. త్వరలో కేరళ, పశ్చిమ బెంగాల్, పుదు చ్చేరి తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో జర గనున్న ఎన్నికల్లో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పార్టీ నిర్మాణానికి సంబంధించి ఏప్రిల్‌లో 15 రోజు లపాటు ప్రత్యేకంగా తాలూకా సమస్యలపై ఉద్య మాన్ని నిర్వహించాలని, ఈ కార్యక్రమానికి ముందు మార్చిలో జిల్లా కౌన్సిల్స్, రాష్ట్ర కౌన్సిల్స్ సమావేశాలు పూర్తి చేసుకుని పార్టీ గ్రామీణ శాఖల్లో సమస్యలను గుర్తించి నాయకులు స్వయంగా ఆయా గ్రామాలకు వెళ్ళి కార్యా చరణను నిర్ణయించుకుని సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని, అలా చేయడం ద్వారా ప్రజల తో సత్సంబంధాలను తిరిగి నెలకొల్పుకోవాలని జాతీయ సమితి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. పుదుచ్చేరిలో గతేడాది మార్చిలో జరిగిన జాతీయ మహాసభ నిర్ణయా ల్లో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుందని తెలి పారు. 90వార్షికోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సామూహిక వసూళ్ళు, చిన్న మొత్తాల వసూళ్ళ ద్వారా రూ.25 కోట్ల నిధి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమా వేశంలో సిపిఐ కార్యదర్శులు షమీవ్‌ు ఫైజీ, డా॥ కె. నారాయణ, ఎపి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, గుంటూరు కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు.