Home కరీంనగర్ 3200

3200

 ముగిసిన మద్యం దుకాణాల లైసెన్స్ టెండర్ల ప్రక్రియ
 20 శాతం ఫీజు పెంచినా వెనక్కు తగ్గని వ్యాపారులు
 గతేడాదితో పోల్చితే 50 శాతం పెరిగిన టెండర్లు
 బరిలో మహిళా వ్యాపారులు
 సందడిగా మారిన ఆబ్కారీ శాఖ కార్యాలయ ప్రాంగణం
 దరఖాస్తులతోనే దాదాపు రూ.15 కోట్ల ఆదాయం
 ఈ నెల 23న కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్ల పరిశీలన

kmnr1కరీంనగర్: జిల్లాలో కార్పొరేషన్, మున్సిపల్ పరిధులు కలుపు కొని 57 మండలాలకు గాను 315 వైన్స్‌షాపులకు టెండర్లు పిలిచారు. సోమవారం 21న టెండర్ ప్రక్రి య ముగిసిపోగా, ఈ నెల 23న కలెక్టర్ ఆధ్వ ర్యంలో పరిశీలన జరుగనుంది. ఆ తర్వాత టెండ ర్లలో ఎంపికైన వ్యాపారులకు 28న లైసెన్సు లు జారీచేసి అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం అమలవు తోంది. టెండర్ ప్రక్రియలో పాల్గొనే ఒక్కో దరఖాస్తు కు రూ.50 వేలు దరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకే తరలిస్తారు. ప్రస్తు తం పోటీ పెరిగి దాదాపు 3200 వరకు దరఖాస్తు లు వచ్చాయి. దీంతో ఆబ్కారీశాఖకు కేవలం దరఖా స్తులతోనే రూ.15 కోట్ల ఆదాయం జిల్లా నుంచి సమకూరనుంది. అయితే లైసెన్స్ ఫీజు మాత్రం ఏడాదిలో మూడు పర్యాయాలుగా చెల్లించే అవకా శం ఉంటుంది. మరో వైపు కార్పొరేషన్, మున్సిపాలి టీ పరిధుల్లో ఒక్కో వైన్స్‌కు లైసెన్స్ ఫీజ్‌ను రూ.42 లక్షలు, మండల కేంద్రాల్లో రూ.34 లక్షలు, గ్రామీ ణ ప్రాంతాల్లో రూ.32.50 లక్షలుగా నిర్ణయించా రు. గతేడాది కరీంనగర్ జిల్లాలో 1924 దరఖాస్తు లు రాగా, ఈ ఏడాది అత్యధికంగా 3200 వరకు వ చ్చాయి. ఇక మహిళా వ్యాపారులు సైతం గతేడాది తో పాల్చితే ఇప్పటివరకు అధికంగా 150 మంది బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా గతేడాది జరిగిన వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకొని కొందరు వ్యాపా రులు ఆయా ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో దరఖాస్తు చేశారు. ఈ తరహాలోనే గోదావరిఖని యూనిట్‌లో కాళేశ్వరం దుకాణానికి 49మంది పోటీ పడుతున్నా రు. మరోవైపు సీల్డ్ కవర్స్ ద్వారా టెండర్ ప్రక్రియ జరుగుతండడంతో పరిశీలన నాటికి ఏయే దుకా ణం ఎంత ధర పలికిందోనని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరి కొందరు మాత్రం తమకు తప్ప కుండా వస్తుందంటూ టార్గెట్ షాప్‌లను దక్కించు కునేందుకు పోటీ పడీ పెద్ద మొత్తంలోనే టెండర్ కో డ్ చేసినట్టు సమాచారం. ఎవరు రేసులో ఉన్నారో తె లియాలంటే ఈ నెల 23 వరకు వేచి చూడాల్సిందే.