Home తాజా వార్తలు ప్రశాంతంగా ముగిసిన హుజుర్ నగర్ ఉపఎన్నికల పోలింగ్

ప్రశాంతంగా ముగిసిన హుజుర్ నగర్ ఉపఎన్నికల పోలింగ్

Huzurnagar By-Electionసూర్యాపేట : హుజూర్‌నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో 85శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.  సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ బూత్ కు చేరుకుని క్యూలైన్ లో నిలుచున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కను వినియోగించుకునే అవకాశం కల్పించారు. పోలింగ్ పూర్తయిన గ్రామాల్లోని ఇవిఎం మిషన్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నారు. ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఈ నెల 24వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు తుది ఫలితం వెల్లడిస్తామని ఎన్నికల అధికారులు చెప్పారు. ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Ended Huzurnagar By-Election Poling