Home భద్రాద్రి కొత్తగూడెం ముగిసిన సింగరేణి బదిలీ వర్కర్ ఉద్యోగ రాతపరీక్ష

ముగిసిన సింగరేణి బదిలీ వర్కర్ ఉద్యోగ రాతపరీక్ష

selling-of-adulterous-seed-in-the-market

655 ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులకు 27,300మంది హాజరు

మన తెలంగాణ/కొత్తగూడెం టౌన్: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాంక్ లాగ్ బ దిలీ వర్కర్స్ ఉద్యోగ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 655 పోస్టులకుగా ను 37,906 మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా ఆదివారం నిర్వహించిన రాతపరక్షకు 27,300మంది హాజరయ్యారు. వీరికోసం కొత్తగూడెం, ఖమ్మం, పా ల్వంచ పట్టణాల్లో 65 పరీక్షా కేంద్రాలను అధఙకారులు ఏర్టా చేశారు. పరీక్షల నిర్వహణను సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్, డైరెక్టర్ (పా) ఎస్.చంద్రశేఖర్, ఇ అండ్ ఎం ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.శంకర్, ప్రాజెక్టు, ప్లానింగ్ డైరెక్టర్ బి.భాస్కర రావులు పర్యవేక్షించారు. గతంలో సింగరేణి సంస్థలో పదివేల మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక వ్రాత పరీక్షకు అనుమతి ఉండగా ప్రస్తుతం జరిగిన పరీక్షకు 37,906మందికి హాల్‌టికెట్లు జారీ చేసి పరీక్షకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అ భ్యర్థులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, రాతపరీక్ష నిర్వహణ పూర్తిగా కంప్యూటర్ ద్వారా, మానవ ప్ర మేయం ఏమాత్రం లేకుండా, నిస్పక్షపాతంగా, చట్టబద్దం గా నిర్వహించామని, పరీక్ష ఫలితాలను రెండు వారాల త ర్వాత సింగరేణి వేబ్‌సైట్లో ఉంచుతామని, ప్రధాన కార్యాలయం మెయిన్ గెల్ నోటీసు బోర్డులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఎంపిక ప్రకియలో ఎవరైనా దళారులు అభ్యర్ధులను మోసం చేస్తుంటే పూర్తి ఆధారాల తో కూడిన సమాచారాన్ని సంస్థ ఉన్నతాధికారులకు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.