Home తాజా వార్తలు పర్యావరణ పరిరక్షణకు పాటుపడండి : ఇంద్రకరణ్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణకు పాటుపడండి : ఇంద్రకరణ్ రెడ్డి

Indrakaran Reddyనిర్మల్ : వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వాడాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలను కోరారు. మట్టి విగ్రహాలను వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవచ్చని ఆయన చెప్పారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టవి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1.60 లక్షల వినాయకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రంగుల విగ్రహాలు వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలగడమే కాకుండా ప్రజలు అనారోగ్యం బారిన పడుతారని, నీళ్లు కలుషితమై జలచరాలు చనిపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వచ్చే 1వ తేదీ వరకు మట్టి విగ్రహాలను అందిస్తామని ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఎఫ్ ఎస్ సిఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, దేవరకోట దేవస్థానం చైర్మన్ ఆమెడ కిషన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మేడారం ప్రదీప్, డాక్టర్. కృష్ణంరాజు పాకాల రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

Engage In Environmental Protection : Indrakaran Reddy