Home తాజా వార్తలు నెలకు 70వేల జీతం… దొంగగా మారిన ఇంజనీర్

నెలకు 70వేల జీతం… దొంగగా మారిన ఇంజనీర్

 thief

విశాఖపట్నం: నెలకు 70వేల జీతం అయిన జల్సాలకు అలవాటు పడి దొంగగా మారాడు ఓ ఇంజనీర్. ఉద్యోగం చేస్తూనే 3 దొంగతనాలు చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చిత్తలకుంటకు చెందిన శ్రీకాంత్ 2013 లో ఓ సిమెంట్ పరిశ్రమలో ఇంజనీర్ గా  చేరాడు. స్నేహితుడి బైకుతో పాటు బంధువుల ఇంట్లో 32 తులాల బంగారం ఆభరణాలు చోరీ చేశాడు. రేండేళ్ల కాలంలో అతనిపై మూడు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా వాహన తనిఖీల్లో భాగంగా విశాఖ పోలీసులు తనిఖీ చేస్తుండగా వాహనానికి సరైన పత్రాలు లేక పోలీసులకు చిక్కాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బైకును స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Engineer became a thief for Jalsalu