Home జాతీయ వార్తలు ఐఫోన్ దొంగతనం… కదులుతున్న రైలు నుంచి దూకి….

ఐఫోన్ దొంగతనం… కదులుతున్న రైలు నుంచి దూకి….

 Jump

 

 

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం హౌరాలో ఓ ఇంజినీర్ రైలు నుంచి దూకి మృతి చెందాడు. ఐఫోన్‌ను దొంగ అపహరించుకొని వెళ్తుండగా సదరు ఇంజినీర్ కదులుతున్న రైలు నుంచి దూకాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సౌరభ్ ఘోష్ అనే ఇంజినీర్ జమ్‌షెడ్‌పూర్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. శంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో జమ్‌షెడ్ పూర్ నుంచి కోల్‌కతా వెళ్తున్నాడు. యుల్బేరియా రైల్వే స్టేషన్‌లో కంపార్ట్‌మెంట్‌లో రైలు ఆగినప్పుడు తాను ఐఫోన్‌లో మాట్లాడుతున్నాడు. రైలు కదిలే సమయంలో ఓ దొంగ ఆ ఫోన్‌ను అపహరించుకొని పారిపోతున్నాడు. వెంటనే అప్రమత్తమైన సౌరభ్ కదులుతున్న రైలు నుంచి దూకాడు. రైలు వేగంగా ఉండడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతడు అపస్మారక స్థితిలోకి పోయాడు. రైల్వే అధికారులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం సౌరభ్ కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని అతి త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. 15 రోజుల క్రితమే తన కుమారుడు ఐఫోన్ కొన్నాడని తండ్రి సంజయ్ ఘోష్ తెలిపారు.

 

Engineer Died Jump from Train Catch Iphone Snatcher