Thursday, April 25, 2024

9 నుంచి ఇంజనీరింగ్ ఎంసెట్ కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

Engineering EAMCET Counseling starts on 9th of this monthEngineering EAMCET Counseling starts on 9th of this month

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 17 వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ నెల 12 నుంచి 18 వరకు విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 12 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఈ నెల 22వ తేదీన మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ నెల 29 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగనుంది. 30న తుది విడత ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. నవంబర్ 2న ఇంజినీరింగ్ తుది విడతలో సీట్లను కేటాయించనున్నారు. నవంబర్ 4వ తేదీన స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను అధికారులు విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా ఈ సారి ఎంసెట్ నిర్వహణ ఆలస్యమైంది.

నేటి నుంచి ఇసెట్ తుది విడత కౌన్సెలింగ్

ఇసెట్ తుది విడత కౌన్సెలింగ్ మంగళవారం(అక్టోబర్ 6) నుంచి ప్రారంభం కానుంది.ఈ మేరకు ఇసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 7న ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ నెల 6,7 తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 6,7 తేదీలలో వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఈ నెల 9వ తేదీన తుది విడత ఇసెట్ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 9 నుంచి 12 వరకు కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి. ఈ నెల 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9వ తేదీన స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News