Thursday, June 12, 2025

ఇంగ్లండ్ రికార్డు విజయం

- Advertisement -
- Advertisement -

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 238 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు జేమీ స్మిత్ (37), బెన్ డకెట్ (60) శుభారంభం అందించారు. జో రూట్ (57), కెప్టెన్ హారీ బ్రూక్ (58), జాకబ్ బెథెల్ (82) అర్ధ సెంచరీలతో అలరించారు. జోస్ బట్లర్ (37), విల్ జాక్స్ (39) కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచారు. తర్వాత క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 26.2 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. జేడన్ సీల్స్ 29 (నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సాఖిబ్ మహమూద్, జేమి ఓవర్టన్ మూడేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News