Thursday, June 12, 2025

ఇంగ్లండ్ క్లీన్ స్వీప్

- Advertisement -
- Advertisement -

వెస్టిండీస్‌తో జరిగిన మూడో, చివరి టి20లో ఆతిథ్య ఇంగ్లండ్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్‌ను 30తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇంతకుముందు వన్డే సిరీస్‌లోనూ ఇంగ్లండ్ వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు జేమీ స్మిత్, బెన్ డకెట్‌లు జట్టుకు విధ్వంసక ఆరంభాన్ని అందించారు. చెలరేగి ఆడిన స్మిత్ 26 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, 4 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. ఇక డకెట్ 46 బంతుల్లో 10 బౌండరీలు, రెండు సిక్స్‌లతో 84 పరుగులు సాధించాడు.

వీరిద్దరూ తొలి వికెట్‌కు 8.5 ఓవర్లలోనే 120 పరుగులు జోడించారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ 22 బంతుల్లో 35 (నాటౌట్), జాకబ్ 36 (నాటౌట్), జోస్ బట్లర్ 10 బంతుల్లో 22 పరుగులు మెరుపులు మెరిపించడంతో ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులు చేసి గట్టి పోటీ ఇచ్చింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన షాయ్ హోప్ వేగంగా 45 పరుగులు చేశాడు. హెట్‌మెయిర్ 8 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు. ఇకద చెలరేగి ఆడిన రొమన్ పొవెల్ 45 బంతుల్లోనే 4 సిక్సర్లు, 9 ఫోర్లతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హోల్డర్ (25) పరుగులు సాధించాడు. మిగతావారు విఫలం కావడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News