Home తాజా వార్తలు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

England Won Toss And Elected Batingమొతేరాలోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో నాలుగో టెస్టు జరుగుతోంది. ఈ క్రమంలో  టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఈ పిచ్ కూడా స్పిన్ కు అనుకూలిస్తుందన్న వార్తలు ముందుగానే వచ్చిన నేపథ్యంలో, తొలుత బ్యాటింగ్ చేయాలని ఇరు జట్లూ భావించాయి. అయితే ఆ అవకాశం ఇంగ్లండ్ కు దక్కడం గమనార్హం. ఈ పిచ్ తొలుత బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నామని, ఆపై స్పిన్ కు సహకరిస్తుందన్న అంచనాతోనే తొలుత బ్యాటింగ్ ను ఎంచుకున్నట్టు ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ తెలిపారు. తమది  కూడా అదే అభిప్రాయమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పారు ఈ మ్యాచ్ లో బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ ను తుది జట్టుకు ఎంపిక చేశారు. తమ స్పిన్నర్లు ఇంగ్లండ్ ను కట్టడి చేయగలరన్న నమ్మకాన్ని కోహ్లీ వ్యక్తం చేశారు.