Home నిజామాబాద్ రైతుకు భరోసా కల్పిద్దాం

రైతుకు భరోసా కల్పిద్దాం

అన్నదాతలకు కనీస మద్దతు ధర ఇప్పించాలి
ఆర్థిక పరిస్థితులపై రైతన్నలకు అవగాహన కల్పించాలి
సహకార సంఘాలు, అధికారులను ఆదేశించిన కలెక్టర్
COLLECTORనిజామాబాద్ టౌన్: రైతులకు కనీస మద్దతు ధర ఇప్పించడానికి అధికారులు అవ సరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.యోగితారాణా సూచించారు. సోమవారం న్యూ అంబేద్కర్ భవన్‌లో సహాకార సంఘాల అధ్యక్షులు, సంబంధత శాఖల అధికా రులతో మద్దతు ధరపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ సహాకార సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం, మొక్కజొన్న మార్క్‌ఫెడ్ ద్వారా నల్లబెల్లం కొనుగోలుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొని సంబం ధిత రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర వర్తింప చేయడానికి అవసర మైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లాలో సహకార సంఘాలు ఆర్థికంగా, బలోపే తంగా ఉన్నాయని, వీటి ఆధ్వర్యంలో రైతులకు మంచి సేవలు అందిస్తున్నారని తెలి పారు. బిగ్రేడ్‌లో ఉన్న జిల్లాలోని సహకార సంఘాలు వచ్చే 6 నెలల్లో ఏ గ్రేడుకు ఎదగడానికి కృషి చేయాలని, ఇందుకు జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ తగు పర్యవేక్షణ చేయాలని అవసరమైన సూచనలు అందించాలని అన్నారు. వర్షాభావ పరిస్థితులు, బోరుబావుల విఫలం తద్వారా ఏర్పడే ఆర్థిక ఇబ్బందులతో రైతులు బాధలకు గురై ఆత్మహత్యల వైపు ఆలోచిస్తున్నారని అభిప్రాయం వెలిబుచ్చారు. రైతులలో సహకార సంఘాలకు ఎక్కువగా సాన్నిహిత్యం ఉన్నందున వారితో సమావేశాలు ఏర్పాటు చేసి వారి ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని ఆత్మహత్యల వైపు వెళ్లకుండా కుటుంబాలకు కష్టాలకు లోను కాకుండా అవగాహన కల్పించాలని కోరారు. నెలలో ఒకసారైనా సంబంధిత రైతులతో ఈ సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో భవిష్యత్తుపై ధైర్యం కల్పించాలని అన్నారు. భూగర్బ జలాల మట్టం తగ్గిపోవటం వల్ల, సరైన పరీక్షలు నిర్వహించకనే బోర్లు డ్రిల్లింగ్ చేయటం వల్ల నీరు పడక, మరోచోట బోర్లు డ్రిలింగ్ చేయించటంతో రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుందని, పరీక్షల అనంతరమే నీరు పడుతుందని దృవీకరించిన తర్వాతనే బోర్లు తవ్వించేలా అవగాహన కల్పించాలని అన్నారు. వ్యవసా యం ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో పాడి పరిశ్రమ తోడుగా ఉంటే రైతులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని, జిల్లాలో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులలో భాగంగా గడ్డిని సాగు చేయుటకు అవకాశాలు ఉన్నాయని, పాల సేకరణ కేంద్రాలు ఉన్నచోట మరిన్ని పాడి గేదెలను అందించడానికి వీలు ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రవీందర్‌రెడ్డి సహాకార బ్యాంకు ఛైర్మన్ గంగాధర్‌రావు పట్వారి, ఐడీసీఎంఎస్ ఛైర్మన్ ముజీబ్, డీసీవో శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.