Home తాజా వార్తలు వర్మ ‘ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌’ టీజర్ రిలీజ్..

వర్మ ‘ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌’ టీజర్ రిలీజ్..

 

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే వివాదాస్పద సినిమాతో బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ.. ‘ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌’ అనే ఇండో చైనీస్ మూవీని కూడా తెరకెక్కిస్తున్నాడు. మార్షల్ ఆర్ట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో పూజా బాలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ మూవీని జింగ్ లీ, నరేశ్ టీ, శ్రీధర్ టీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఈ మూవీ టీజర్ ను వర్మ ట్విటర్ ద్వారా విడుదల చేశాడు. సాదారణంగా మార్షల్ ఆర్ట్స్ చిత్రం అంటే యూనిఫార్మ్ వేసుకొని ఫైట్స్ చేస్తారు. కానీ, అందరిలా సినిమా చేస్తే ఆయన వర్మ ఎందుకు అవుతారు. పూజ చేత ఓ రేంజ్ లో స్కిన్ షో చేయించాడు. హాట్ డ్రెస్సులలో హీటెక్కించే పోరాటాలను ఆమెతో చేయించాడు వర్మ. ఈ చిత్రానికి రవిశంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డిసెంబర్ 13న ఈ సినిమా ట్రైలర్‌ను బ్రూస్ లీ సొంత నగరం చైనాలోని ఫోషన్ సిటీలో రిలీజ్ చేయనున్నట్లు వర్మ తెలిపాడు. వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

ENTER THE GIRL DRAGON Movie Teaser Released