Home తాజా వార్తలు రెండు రెట్ల వినోదం

రెండు రెట్ల వినోదం

prathi roju pandaga movie

 

ఇటీవలే ‘చిత్రలహరి’ చిత్రంతో మంచి విజయం అందుకొన్న సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిరోజు పండగే’. రాశి ఖన్నా హీరోయిన్‌గా రూపొందిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఆ తరువాత షెడ్యూల్‌ని అమెరికాలో షూట్ చేయబోతున్నారు. అలాగే ఈనెల 15న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. హీరో సాయి ధరమ్ తేజ్, సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇక దర్శకుడు మారుతి… హీరో సాయి ధరమ్ తేజ్ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో న్యూ లుక్‌లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కుటుంబ బంధాలు, విలువలను ఎమోషనల్‌గా చిత్రీకరిస్తున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్‌టైన్‌మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతోంది. జిఎ2, యువి పిక్చర్స్ బ్యానర్‌లలో ఈ చిత్రాన్ని గ్రాండియర్‌గా నిర్మిస్తున్నారు. సత్యరాజ్, విజయ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్‌ః – తమన్, ఎడిటర్ ః కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌ః రవీందర్.

Entertainment double in prathi roju pandaga movie