Home జోగులాంబ గద్వాల్ నవోదయ, గురుకుల ప్రవేశ పరీక్షలు

నవోదయ, గురుకుల ప్రవేశ పరీక్షలు

Navodaya and Gurukula 2019 Entrance exams

 

జోగులాంబ గద్వాల్: జిల్లాలో శనివారము నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతందని అలంపూరు మండల విద్యాధికారి అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉదయం 11.30 గంటల నుండి 1.30 గంటల నుండి వరకు జరుగుతుందని అందుకు అలంపూరులో 2 సెంటర్లలో 497 మంది విద్యార్థులు నవోదయ పరీక్షకు హాజరవుతున్నారని, ఆదివారము గురుకుల ప్రవేశ పరీక్ష వుంటుందని ఆయన మరొక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 11.00 గంటల నుండి 1.00 గంట వరకు జరుగుతనన్నారు. గురుకుల పాఠశాలలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు అలంపూరులో 3 సెంటర్లని కేటాయించామని తెలిపారు. మూడు సెంటర్లలో 720 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందు కేంధ్రాలకు రావాలని ఆయన కోరారు.

Entrance exams of Navodaya and Gurukula 2019