Home లైఫ్ స్టైల్ ఫారిన్ వర్శిటీలకు ఎంట్రీ ‘జిఆర్‌ఇ’

ఫారిన్ వర్శిటీలకు ఎంట్రీ ‘జిఆర్‌ఇ’

life2

అమెరికాలాంటి దేశాలకు వెళ్ళి ఉన్నత విద్యనభ్యసించదలచుకున్న వారు జిఆర్‌ఇ, సాట్, యాక్ట్ వంటి పరీక్షలు క్లియర్ చేయాలి. ఇక్కడ సాధించే స్కోరే విదేశాలలో పిజి కోర్సులు చేయడానికి, పిహెచ్‌డి చేయడానికి రహదారిలా పనిచేస్తుంది. అనేక విదేశీ యూనివర్శిటీలు ఆమోదించి ఆదరిస్తున్న జిఆర్‌ఇ స్కోర్ విదేశీ చదువులకు తొలిమెట్టుగా భావించవచ్చు. జిఆర్‌ఇ అంటే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్. దీన్ని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఇటిఎస్) వారు పరమ ప్రామాణికంగా రూపొందించి నిర్వహిస్తారు. ఈ పరీక్ష 1949లో మొదలైంది. విద్యార్థి ఆలోచనాధోరణిని, విశ్లేషణా పటిమను అంచనావేయడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. అందుకుగానూ వెర్బల్ రీజనింగ్‌ను, ఎనలిటికల్, మాతమాటికల్ స్కిల్స్, క్వాంటిటేవ్ రీజనింగ్ స్కిల్స్‌ను ఈ పరీక్షద్వారా పరిశీలిస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ పరీక్ష మూడు దశలలో ఉంటుంది.
1. వెర్బల్ రీజనింగ్
2. క్వాంటిటేటివ్ రీజనింగ్
3. ఎనలిటికల్ రైటింగ్
జిఆర్‌ఇ పరీక్ష మొత్తంగా 3.45 గంటలు ఉంటుంది. ఒకొక్క సెక్షన్ పూర్తయ్యాక ఒక నిమిషం విశ్రాంతి ఇస్తారు. మూడు సెక్షన్‌లు పూర్తయ్యాక 10 నిమిషాలు బ్రేక్ ఇస్తారు. వెర్బల్ రీజనింగ్ పరీక్ష, క్వాంటిటేటివ్ రీజనింగ్ పరీక్ష రెండూ 130- 170 మార్కులకు ఉంటాయి. రెండిటిలోనూ సరైన సమాధానానికి ఒక మార్కుచొప్పున ఇస్తారు. ఎనలిటికల్ రైటింగ్‌లో 06 మార్కులు ఉంటాయి. ఇక్కడ సరైన సమాధానానికి సగం మార్కు ఇస్తారు. ఈ పరీక్షలో సంపాదించిన స్కోర్ 5 సంవత్సరాలు చెల్లుతుంది. ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్‌గానూ, పేపర్ బేస్డ్‌గానూ నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను పరీక్ష తేదీ నుంచి 21 రోజుల తర్వాత ఒక్కసారి రాయొచ్చు. గతంలో పరీక్షరాసి స్కోర్ క్యాన్సిల్ చేసుకున్న వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. పేపర్‌బేస్డ్ పరీక్షలు మాత్రం అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి మాసాలలో జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అందుబాటులో లేని చోట్ల మాత్రమే పేపర్‌బేస్డ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లీషులో మాత్రమే ఉంటుంది. బ్యాచ్‌లర్ డిగ్రీ చేసినవారు, చేస్తున్నవారు, అండర్‌గ్రాడ్యుయేట్లు ఈ పరీక్ష రాయొచ్చు. ఇంగ్లీషులో ప్రావీణ్యత ఉంటేనే ఈ పరీక్షలో నెగ్గుకురాగలుగుతారు. 160 దేశాలలో 700 జిఆర్‌ఇ పరీక్షా కేంద్రాలున్నాయి. జిఆర్‌ఇ పరీక్షఫీజు 205 అమెరికా డాలర్లు. అన్ని ఎలిజిబిలిటీలు ఉన్న కాలేజీ సీనియర్లకు, ఎన్‌రోల్ కాని కాలేజీ గ్రాడ్యుయేట్లకు పరీక్ష ఫీజు రద్దు చేస్తారు. కానీ ఇది చాలా అరుదు. పిజిలో ఏ సబ్జెక్ట్‌లో సెషలైజేషన్ చేసేందుకు విద్యార్థి కోరుకుంటున్నాడో ఆ సబ్జెక్ట్‌లో అండర్‌గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఆయన సంపాదించిన సబ్జెక్ట్ నాలెడ్జి ఎంతో తేల్చడానికి సబ్జెక్ట్ టెస్ట్ పెడతారు. దీనిలో మంచి స్కోర్ వస్తే యూనివర్శిటీలు ఇంప్రెస్ అయి సీటు ఇవ్వడానికి వీలుంటుంది.
ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం కోసం టోఫెల్
ఇక టోఫెల్ విషయానికి వస్తే ఇది మనకున్న ఇంగ్లీషు భాషా ప్రావీణ్యాన్ని గుర్తించేందుకు ఏర్పాటైంది. విదేశాలలో ఇంగ్లీషుకే చెలామణి ఉంటుంది. విద్యార్థికి ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడడం వస్తే చాలదు. అవతల వారి యాసను కూడా తప్పుల్లేకుండా అర్థం చేసుకోగల పరిస్థితి ఉండాలి. ఇంగ్లీషును సరిగా విని ఫాలో అవుతున్నారో లేదో పరిశీలించేందుకు మనకు రెండు రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి టోఫెల్, రెండోది ఐఎల్‌ట్స్. టోఫెల్‌ను కూడా ఇటిఎస్ వారే నిర్వహిస్తారు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మని, ఇటలీ తదితర దేశాలలోని యూనివర్శిటీలు, ఎకాడమీలు, ప్రొఫెషనల్ ఇనిస్టిట్యూషన్‌లు టోఫెల్ పరీక్షను, అందులో వచ్చిన స్కోర్‌ను గుర్తించాయి. ఈ పరీక్షలో ఇంగ్లీష్ మాతృభాష కానివారిలో రీడింగ్ ఎబిలిటీ, లిజనింగ్ ఎబిలిటి, స్పీకింగ్ ఎబిలిటీ, రైటింగ్ ఎబిలిటి చూస్తారు. ఈ పరీక్షను 53 సంవత్సరా క్రితం అంటే 1964లో ప్రారంభించారు. ఇంటర్నెట్ బేస్డ్ పరీక్ష (ఐబిటి) అయితే 3.104.20 గంటలు ఉంటుంది. మధ్యలో 10 నిమిషాల బ్రేక్ ఉంటుంది. అదే పేపర్ బేస్డ్ టెస్ట్ (పిబిటి) అయితే 2.202.30 గంటలు ఉంటుంది. ఐబిటి పరీక్ష 4 సెక్షన్‌లలో ఉంటుంది. ఒకొక్క సెక్షన్‌కి 30 మార్కులు ఉంటాయి. అంటే మొత్తంగా 120 మార్కులు ఉంటాయి. పిబిటిలో లిజనింగ్ (3168 మార్కులు), స్ట్రక్చర్ (3169 మార్కులు), రీడింగ్ (3167 మార్కు లు) అని 3 దశలలో పరీక్ష ఉంటుంది. మొత్తంగా 310677 మార్కులుంటాయి. రాతపరీక్ష విడిగా నిర్వహిస్తారు. ఇది 6 మార్కులకుంటుంది. ఒకొ క్క ప్రశ్నకు ఒకొక్క మార్కు ఉంటుంది. ఇక్కడ సం పాదించిన స్కోర్‌కు 2యేళ్ళ వరకు చెల్లుబాటు ఉంటుంది. ఐబిటి పరీక్ష యేడాదిలో 50 సార్లు ఉంటుంది. 12 రోజులకొకసారి రాయొచ్చు. 165 దేశాలలో 4,500 పరీక్షా కేంద్రాలున్నాయి. దీనికి ప్రత్యేకించి అర్హతలేవి లేవు. 130 దేశాలలోని 10,000 కాలేజీలు, ఏజెన్సీలు, ఇతర ఇనిస్టిట్యూషన్లు ఈ స్కోరును ప్రాతిపదికగా తీసుకుంటాయి.