Home తాజా వార్తలు పర్యావరణ్ రక్షక్ సమ్మాన్ 2020 జాతీయ అవార్డు

పర్యావరణ్ రక్షక్ సమ్మాన్ 2020 జాతీయ అవార్డు

karunakar-reddy

 

హైదరాబాద్ : వాక్ ఫర్ వాటర్, ఇగ్నైటింగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థలతో నీరు, మొక్కలు, ప్రకృతి వనరుల పరిరక్షణకోసం విశేషంగా కృషి చేస్తున్న ఎం. కరుణాకర్‌రెడ్డిని పర్యావరణ్ రక్షక్ సమ్మాన్ 2020 అవార్డు వరించింది. రాజస్థాన్‌కి చెందిన తరుణ్ భారత్ సంఘ్… పర్యావరణ ప్రగతి, పరిరక్షణకోసం పాటు పడే వ్యక్తులను ఏటా అవార్డులతో సత్కరిస్తోంది. హరిత భారత్ సవాలుతో మొక్కలు నాటే సామాజిక ఉద్యమానికి పునాది వేయడంతో పాటు జల, వన సంరక్షణ- సామాజిక బాధ్యత పేరుతో చేస్తున్న సేవలకుగాను 2020 అవార్డు గ్రహీతగా కరుణాకర్‌రెడ్డిని ఎంపిక చేసింది.

గురువారం రాజస్థాన్ అల్వార్‌లోని తరుణ్ భారత్ సంఘ్ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ, ముని మనవడు తరుణ్ గాంధీ, వాటర్ మాన్ రాజేంద్ర సింగ్, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యామూర్తి, తెలంగాణ జలవనరుల అబివృద్ధి సంస్థ చైర్మన్ వీ.ప్రకాష్ రావు తదితరుల చేతుల మీదుగా కరుణార్‌రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు. తరుణ్ భారత్ సంఘ్ పర్యావరణ పురస్కారం ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి తనకి రావడం తెలుగువాడిగా గర్వంగా ఉందని ఈ సందర్భంగాస కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ 150వ జన్మ సంవత్సరములో వారి మనవడు అరుణ్ గాంధీ,మునిమనవడు తరుణ్ గాంధీచేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకోవడము అత్యంత ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. కాగా కర్ణాటక రాష్ట్రము నుండి జలవనరుల అభివృద్ధి మంత్రి ఎంబి పాటిల్ కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.

Environment Rakshak Samman 2020 National Award