Thursday, March 28, 2024

భారీ మూల్యమే చెల్లించుకున్నాం: ఇయాన్ మోర్గాన్

- Advertisement -
- Advertisement -

Eoin Morgan reacts after KKR defeat against RCB

అబుదాబి: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలనే నిర్ణయం తమ ఓటమికి ప్రధాన కారణమని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే నమ్మకంతో బ్యాటింగ్‌కు మొగ్గు చూపానన్నాడు. అయితే, ఆరంభంలోనే ఈ నిర్ణయం చాలా పెద్ద పొరపాటని అర్థమైందన్నాడు. మరోవైపు బెంగళూరు బౌలర్లు అసాధారణ రీతిలో చెలరేగిపోయారన్నాడు. ముఖ్యంగా సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో తమను కోలుకోలేని దెబ్బతీశాడన్నాడు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని ప్రత్యర్థి బౌలర్లు చక్కగా ఉపయోగించుకున్నారన్నాడు. ఈ ఓటమి తమకు ఓ గుణపాఠం వంటిదన్నాడు. రానున్న మ్యాచుల్లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా చూస్తామన్నాడు. ఇక లక్ష్యం మరి చిన్నదిగా ఉండడంతో ఓటమి ముందే ఖరారైందన్నాడు. కాగా, సమష్టి వైఫల్యమే ఓటమికి కారణమని, ఇందులో ఏ ఒక్క ఆటగాడిని బాధ్యుడిగా చేయడం సరికాదని మోర్గాన్ పేర్కొన్నాడు.

Eoin Morgan reacts after KKR defeat against RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News