Friday, April 19, 2024

చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు: ఎర్రబెల్లి

- Advertisement -
Errabelli birth day wishes to chukka ramaiah
హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, జనగామ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం గూడూరుకు చెందిన చుక్కా రామ‌య్య‌ను హైద‌రాబాద్ లోని విద్యాన‌గ‌ర్ లో గ‌ల‌ ఆయ‌న నివాసంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు క‌లిసి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.
అలాగే ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేసి, శాలువాతో స‌త్క‌రించి స్వీట్ బాక్స్ ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి దాయ‌క‌ర్ రావు మాట్లాడారు. 1925 ఇదే రోజు పాల‌కుర్తి మండ‌లం గూడురులో జ‌న్మించిన చుక్కా రామ‌య్య‌, నాడు హైదరాబాదు సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు.
నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళాడని, అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడన్నారు. జ‌న‌గామ‌లో ఉపాధ్యాయుడిగా చేరి, అనేక చోట్ల ప‌ని చేసిన ఆయ‌న‌, నాగార్జున‌సాగ‌ర్ ఆవాస పాఠ‌శాల ప్రిన్సిపాల్ గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశార‌న్నారు.
అనంత‌రం ఐఐటి శిక్ష‌ణా కేంద్రాన్ని ప్రారంభించ‌డం కోసం హైద‌రాబాద్ కి వ‌చ్చి, న‌ల్ల‌కుంట‌లో ఆ కేంద్రాన్ని న‌డుపుతున్నార‌న్నారు. అప్ప‌టి నుండి చుక్కా రామ‌య్య కాస్తా, ఐఐటి రామ‌య్య‌గా పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు.
ఉమ్మ‌డి రాష్ట్రంలో 2007లో ఎమ్మెల్సీగా ఉండి ప్రజలకు సేవలందించారు. పిల్ల‌ల‌కు, పెద్ద‌ల కోసం అనేక ర‌చ‌న‌లు చేసిన రామ‌య్య‌, ఆయు ఆరోగ్యాల‌తో ఉండాల‌ని, ఆయ‌న‌కు సుదీర్ఘ జీవితం ల‌భించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి కోరుకున్నారు. కొద్దిసేపు ఆయ‌న‌తో ముచ్చ‌టించారు. దేశం, రాష్ట్రంలోని స‌మ‌కాల‌నీ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి గురించి ఇద్ద‌రూ కాసేపు మాట్లాడుకున్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News