Saturday, April 20, 2024

ప్రైవేటీకరణ పేరిట రిజర్వేషన్లకు మంగళం: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Errabelli dayakar rao comments on BJP

వరంగల్‌రూరల్: తెలంగాణను మోడీ ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని దుయ్యబట్టారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. కేంద్రం తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిందని, ప్రైవేటీకరణ పేరిట రిజర్వేషన్లకు మంగళం పాడేందకు మోడీ ప్లాన్ చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీనైనా నెరవేర్చని బిజెపికి ఓటేద్దామా? అని పట్టబద్రులు ఆలోచించాలన్నారు. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండా పరిపాలన చేస్తున్న సిఎంకెసిఆర్‌కు మద్దతు తెలుపుదామన్నారు. బిజెపి గోబెల్స్ ప్రచారాన్ని చూస్తూ ఊరుకోవద్దని వారికి ధీటుగా తిప్పికొట్టాలన్నారు. దేశంలో 152 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు 7 కాలేజీలు ఇచ్చారని, పార్లమెంటులో రైతాంగ బిల్లుకు మద్దతు తెలిపినందుకు ఎపికి 7 కాలేజీలు ఇచ్చారన్నారు. వ్యవసాయ బిల్లులకు సిఎం కెసిఆర్ మద్దతు ఇవ్వనందుకు మొండిచేయి చూపారని, విభజన చట్టానికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. ఈ కార్యక్రమానికి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంఎల్‌సి బస్వరాజు సారయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News